అన్వేషించండి

AAY Movie Review - ఆయ్ రివ్యూ: ఎన్టీఆర్ బావమరిది సినిమా - ఈ వీకెండ్ విన్నర్ ఇదేనా?

AAY Review In Telugu: 'మ్యాడ్' విజయం తర్వాత ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన సినిమా 'ఆయ్'. ఈ రోజు పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. రేపు ఫుల్ రిలీజ్. ఈ సినిమా ఎలా ఉందంటే?

Narne Nithin's AAY movie review in Telugu: 'మ్యాడ్' సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతో విజయం అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన రెండో సినిమా 'ఆయ్'. అల్లు అరవింద్ సమర్పణలో 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది?

కథ (AAY Movie Story): కార్తీక్ (నార్నే నితిన్)ది అమలాపురం దగ్గరలోని పల్లెటూరు. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంటికి వస్తాడు. టౌనుకు వెళ్లి వస్తున్నప్పుడు పల్లవి (నయన్ సారిక)ను చూసి ఇష్టపడతాడు. తనను తాను పరిచయం చేసుకుంటాడు. మెల్లగా ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే... ఇంటిలో తండ్రి చూసిన సంబంధం చేసుకోవడానికి ఓకే అంటుంది. తన తండ్రి వీరవాసరం దుర్గ (మైమ్ గోపి)కి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని, ఒకవేళ వేరే క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించానని తెలిస్తే వాళ్లను చంపేస్తాడని చెబుతుంది.

కార్తీక్ (Narne Nithin Role In AAY Movie)ను పల్లవి నిజంగా ప్రేమించిందా? లేదా ప్రేమ పేరుతో ఫ్రెండ్షిప్ చేసిందా? పల్లవి మరొకరితో పెళ్లికి ఒప్పుకోవడంతో కార్తీక్ ఏం చేశాడు? ఎలాగైనా అతడికి పల్లవిని ఇచ్చి పెళ్లి చేయాలని కార్తీక్ స్నేహితులు సుబ్బు (రాజ్ కుమార్ కసిరెడ్డి), హరి (అంకిత్ కొయ్య) ఏం చేశారు? తండ్రి అడబాల బూరయ్య (వినోద్ కుమార్)తో కార్తీక్ ఎందుకు సరిగా మాట్లాడడు? కొడుకు ప్రేమ విషయం తెలిసి ఆయన ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (AAY Review Telugu): క్యాస్ట్ ఫీలింగ్, గోదావరి నేపథ్యంలో ఇటీవల 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా వచ్చింది. 'ఆయ్' కూడా గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఇందులోనూ క్యాస్ట్ ఫీలింగ్ కాన్సెప్ట్ ఉంది. గోదావరి కుర్రోళ్ళ స్నేహం ఉంది. కానీ, రెండు సినిమాల్లో కథలు - క్యారెక్టర్లు పూర్తిగా వేర్వేరు. కామన్ థింగ్ వచ్చి కామెడీ!

'ఆయ్' దర్శక నిర్మాతలు ఫార్ములా ఒక్కటే... ప్రేక్షకుల్ని నవ్వించడం! ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆ ప్రయత్నం తెరపై కనిపించింది. ఈ క్రమంలో కొన్నిసార్లు చిన్నగా గీతకు ఆ వైపు అడుగులు పడ్డాయి. అయితే, ఆ సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌ను కొంత వరకు ఆకట్టుకోవచ్చు. దర్శకుడు అంజి కె మణిపుత్ర లిమిటేషన్స్ పెట్టుకోలేదు. వైసీపీ వాలంటీర్ వ్యవస్థ, పల్లెటూళ్లలో ఫోన్ కాల్ ప్రేమలు, లవర్ ఓకే అన్నప్పుడు రూమ్ కోసం పడే పాట్లు - అన్నీ చూపించారు.

'ఆయ్' సింపుల్‌గా మొదలైంది. హీరో ఇంట్రడక్షన్ మొదలు ప్రేమలో పడే వరకు సోసోగా ముందుకు వెళుతుంది. అప్పటి వరకు వేసిన జోక్స్ కొన్ని పేలాయి. కానీ, ఎఫెక్టివ్‌గా అనిపించదు. ఎప్పుడైతే నార్నే నితిన్, రాజ్ కుమార్ కసిరెడ్డి... ఇద్దరూ నయన్ సారికను ప్రేమించారని రివీల్ అవుతుందో, అప్పుడు కామెడీ వర్కవుట్ అయ్యింది. రాజ్ కుమార్ చెలరిగిపోయాడు. భారీ లెక్చర్లు ఇవ్వకుండా చివరిలో తండ్రి క్యారెక్టర్ రివీల్ చేయడం, సింపుల్‌గా ముగించడం బావుంది. రాకేష్ వర్రే 'ఎవ్వరికీ చెప్పొద్దు'లోనూ హీరో హీరోయిన్ల కులాలు వేర్వేరు. అందులో క్లాసీగా డీల్ చేస్తే... ఈ సినిమాలో కామెడీ కోటింగ్ ఇచ్చి తీశారు.   

మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ల మీద నార్నే నితిన్ దృష్టి పెట్టినట్టు ఉన్నారు. 'మ్యాడ్'లో కాలేజీ స్టూడెంట్, 'ఆయ్'లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా సరే ప్రజెంట్ జనరేషన్ కుర్రాడిలా కనిపించారు. హీరోయిజం వైపు వెళ్లకుండా 'ఆయ్'లోనూ కంటెంట్ బేస్డ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. కార్తీక్ పాత్రకు, కథకు తగ్గట్టు నటించారు. నయన్ సారికది ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. చిన్న చిన్న సన్నివేశాల్లో కూడా యాక్టింగ్ రిజిస్టర్ అయ్యేలా చేశారు.

Also Readస్త్రీ 2 రివ్యూ: శ్రద్ధా కపూర్ మళ్లీ వచ్చిందిరోయ్... బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టరేనా? మూవీ ఎలా ఉందంటే?


రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, నార్నే నితిన్... ముగ్గురి కాంబినేషన్ భలే కుదిరింది. మ్యాగ్జిమమ్ సన్నివేశాల్లో ఆ ముగ్గురూ నవ్వించారు. రాజ్ కుమార్ కామెడీ టైమింగ్ అమేజింగ్. అంకిత్ కొయ్య కూడా చక్కగా నటించారు. వీటీవీ గణేష్, సరయు సీన్లు కొన్ని వర్కవుట్ అయ్యాయి. మైమ్ గోపికి ఇటువంటి రోల్స్ కొత్త కాదు. కానీ, తన పరిధి మేరకు నటించారు. సినిమా స్టార్టింగ్ నుంచి వినోద్ కుమార్ ఆ రోల్ ఎందుకు చేశారని, ఇంపార్టెన్స్ లేదని అనుకుంటే... పతాక సన్నివేశాల్లో ట్విస్ట్ ఇచ్చారు.

AAY Movie Review In Telugu: 'ఆయ్' టైటిల్ కార్డులో లాజిక్స్ వద్దని ఓ కొటేషన్ వేశారు. అందుకని, లాజిక్కులు పక్కనపెట్టి... రెండు గంటలు హాయిగా నవ్వుకోవాలంటే 'ఆయ్'కు వెళ్లండి. గోదారి ఎటకారం, స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలు నవ్విస్తాయి. ఈ వీకెండ్ వచ్చిన సినిమాల్లో మెజారిటీ జనాల్ని మెప్పించే అవకాశాలు ఉన్న చిత్రమిది.

Also Readమిస్టర్ బచ్చన్ రివ్యూ: రవితేజ ఎనర్జీ సూపర్... మరి ఎక్కడ తేడా కొట్టిందేంటి? హిందీ 'రెయిడ్'ను హరీష్ శంకర్ ఎలా తీశారంటే...?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget