Kalki 2898 AD: ఊహించని రీతిలో ‘కల్కి’ ప్రమోషన్, విడుదలకు ముందే ఓటీటీలోకి!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
Kalki 2898 AD Animated Project: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘‘కల్కి 2898AD’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజిలో తెరకెక్కిస్తున్నారు. పురాణాలను బేస్ చేసుకుని ఫ్యూచర్ టెక్నాలజీకి లింక్ చేస్తూ రూపొందిస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పలు సినిమాలు ఇప్పటికే అద్భుత విజయాలు అందుకున్న నేపథ్యంలో ‘కల్కి‘పై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజిలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమా ప్రమోషన్ ను నాగ్ అశ్విన్ వినూత్న రీతిలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
యానిమేషన్ వీడియో ద్వారా ‘కల్కి’ ప్రచారం
నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ ను బిజినెస్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు నాగ్ అశ్విన్. ‘కల్కి 2898AD’ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ముఖ్య పాత్రధారుల పరిచయం చేస్తూ ఓ ప్రమోషనల్ యానిమేషన్ వీడియోను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్రలను ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు వెల్లడించనున్నారు. ఈ యానిమేషన్ వీడియోను సినిమా విడుదలకు ముందే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషనల్ వీడియో రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘కల్కి 2898AD’ సినిమా విడుదలకు నెల రోజుల ముందే ఈ వీడియోను ఓటీటీ వేదికగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సుమారు 10 ముఖ్యమైన పాత్రలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాటికి సంబంధించిన యానిమేషన్ పనులతో పాటు డబ్బింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
EXCLUSIVE: KALKI TEAM TO RELEASE ONE OF ITS KIND ANIMATED-PRELUDE!
— Himesh (@HimeshMankad) April 5, 2024
A prelude introducing the world of #Kalki2898AD to premiere on OTT; #Prabhas dubs for his own part in this global animated project - Here's all you need to know about #Kalki! https://t.co/7EDw0bt3AY
‘కల్కి’ విడుదల వాయిదా!
‘కల్కి’ సినిమాను తమ సెంటిమెంట్ ప్రకారం మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, ఎన్నికల కారణంగా మూవీ వాయిదా వేయకతప్పుదు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడో ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. అయితే ఈ సినిమాను మే 30న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. రెండో హీరోయిన్ గా దిశా పటానీ కనిపించనుంది. జెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 AD' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వైజయంతీ బ్యానర్ లో అశ్వినిదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Also Read: సెట్‌లో అందరూ చప్పట్లు కొట్టారు, ప్రేక్షకులు మాత్రం ట్రోల్ చేశారు - ‘యానిమల్’పై రష్మిక స్పందన