అన్వేషించండి

Fighter: ‘ఫైట‌ర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Fighter: హృతిక్ రోషన్, దీపికా పదుకునే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఫైట‌ర్'. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బంప‌ర్ హిట్ కొట్టిన ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రానుంది.

Fighter OTT Release: బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్, దీపికా ప‌దుకునే జంట‌గా న‌టించిన సినిమా ఫైటర్ . జ‌న‌వ‌రి 25న రిలీజైన ఈ యాక్ష‌న్ సినిమా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. తొలి షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రానుంది. మార్చి 21న 'ఫైట‌ర్' ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంద‌నే వార్త నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు.

స్ట్రీమింగ్ ఎక్క‌డంటే? 

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 'ఫైటర్' ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ భారీ ధర చెల్లించినట్లు అప్ప‌ట్లో వార్త‌లు వినిపించాయి. థియేటర్లో విడుదలైన 56 రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల‌నే ఒప్పందం కూడా చేసుకున్నార‌ట మేక‌ర్స్. దీంతో సినిమా రిలీజైన 56వ రోజు.. అంటే మార్చి 21న ఈ  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

భారీ క‌లెక్ష‌న్లు..

'ఫైట‌ర్' రిలీజైన త‌ర్వాత హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, రెండోరోజు ఆశించినంత క‌లెక్ష‌న్లు రాలేదు. దీంతో ఆ సినిమా డైరెక్ట‌ర్ కొంత అస‌హ‌నానికి గుర‌య్యారు. కానీ, ఆ త‌ర్వాత క‌లెక్ష‌న్లు పుంజుకున్నాయి. ఈ సినిమా దాదాపు రూ.340 కోట్లు క‌లెక్ష‌న్ సాధించింది. రిలీజైన రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్లు క‌లెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇక మూడో రోజుకి అది రూ.150 కోట్లు దాటిన‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వెల్ల‌డించాయి. అలా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా హిట్ అయ్యింది 'ఫైట‌ర్'. 

ఏరియల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనెలతో పాటూ బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ యాక్షన్ సినిమాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వ‌హించారు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మించారు. ఈ సినిమాకి విశాల్ శేఖర్ సంగీతం అందించారు.

ఎన్టీఆర్ తో 'వార్2'

'ఫైటర్' తర్వాత హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ చేస్తున్నారు. 2019లో రిలీజైన వార్ సినిమాకి సీక్వెల్‌గా 'వార్ 2’ తీస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇందులో మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. 2025లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం 'దేవ‌ర' షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత 'వార్ 2' కోసం రెడీ అవుతార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక 'వార్ 2'లో హృతిక్ రోష‌న్ హీరో కాగా.. ఎన్టీఆర్ విల‌న్ గా క‌నిపించ‌నున్నారు.

Also Read: విజ‌య్ దేవ‌రకొండ సినిమాలు నచ్చవు: పీవీ సింధూ షాకింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget