అన్వేషించండి

P.V. Sindhu: విజ‌య్ దేవ‌రకొండ సినిమాలు నచ్చవు: పీవీ సింధూ షాకింగ్ కామెంట్స్

PV Sindhu: భార‌త బ్యాడ్మింట‌ర్ స్టార్ పీవీ సింధూ.. ఎప్పుడూ స్పోర్ట్స్ లో బిజీగా ఉండే.. ఈ స్టార్ ప్లేయర్ మొద‌టి సారి సినిమాల గురించి మాట్లాడింది. త‌న అభిమాన హీరో ఎవ‌రో చెప్పింది.

PV Sindhu about vjay devarakonda movies: భార‌త బ్యాడ్మింట‌ర్ స్టార్ ప్లేయ‌ర్ పీవి సింధూ. ఎన్నో అద్భుత‌మైన విజ‌యాలు న‌మోదు చేసిన ప్లేయ‌ర్. ఒలింపిక్స్, కామ‌న్వెల్ట్ గేమ్స్ లో ప‌త‌కాలు తెచ్చి.. భార‌త ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా సాటిచెప్పారు పీవీ సింధూ. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఎప్పుడూ స్పోర్ట్స్, దాని తాలుకూ ఈవెంట్స్ తో బిజీగా ఉండే పీవీ సింధూ ఒక ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడారు. ప్ర‌భాస్ అంటే ఇష్టం అని, దేవ‌రకొండ సినిమాలు చూడ‌న‌ని చెప్పారు. 

అత‌ని  సినిమాలు చూడ‌ను.. 

పీవీ సింధూ చాలా రోజుల త‌ర్వాత ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఒక డిజిటల్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె త‌న కెరీర్, ఆట‌, ఆట కోసం ప‌డ్డ క‌ష్టాలు అన్నీ పంచుకున్నారు. ఇక సినిమాల గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. ప్ర‌భాస్ క్ర‌ష్, ఆయ‌న అంటే ఇష్టం అని వ‌చ్చిన వార్త‌ల‌పై ఆమె స్పందించారు. "ప్ర‌భాస్ క్ర‌ష్ లాంటివి ఏమీ లేవు. ఆయ‌న అంటే ఇష్టం. ఆయ‌న సినిమాలు బాగా చూస్తాను. సినిమాలు అంటే ఇష్టం. అలానే రామ్ చ‌ర‌ణ్ సినిమాలు కూడా బాగా చూస్తాను. ఆయ‌న్ను క‌లిశాను. మెడల్ వచ్చినప్పుడు చిరంజీవి గారు  ఇంటికి పిలిపించి పార్టీ ఇచ్చారు. ఎంక‌రేజ్ చేశారు. సో స్వీట్ అస‌లు.. అప్పుడు రామ్ చ‌ర‌ణ్‌ను క‌లిశాను. ఎన్టీఆర్ సినిమాలు కూడా బాగానే చూస్తాను. ఈ మ‌ధ్య ‘RRR’ కూడా చూశాను. కొత్త‌గా చాలామంది వ‌స్తున్నారు. విజ‌య దేవ‌ర కొండ సినిమాలు అన్నీ చూడ‌ను. విజ‌య‌దేవ‌ర కొండ సినిమాలు కొన్ని న‌చ్చాయి. కొన్ని న‌చ్చలేదు. అందుకే, అన్నీ చూడ‌ను. ఎవ‌రి ఇష్టం వాళ్ల‌ది.. వాళ్ల‌కి కూడా ప్ర‌ెజ‌ర్స్ ఉంటాయి. కాబ‌ట్టి ఎవ‌రిని విమర్శించను" అని అన్నారు పీవీ సింధూ. "అభిమాన హీరో ఎవ‌రు అంటే ఎవ‌రి పేరు చెప్తారు?" అని అడిగితే.. అలా అని ఎవ్వ‌రూ లేరు... ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీ చేయొద్దు.. అని న‌వ్వుతూ స‌మాధానం చెప్పారు సింధూ. 

ఫ‌న్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్న సింధూ.. 

70 ఏళ్ల ఒక వ్య‌క్తి త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని వ‌చ్చాడ‌ని.. త‌న జీవితంలో జ‌రిగిన ఒక ఫ‌న్నీ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నారు పీవీ సింధూ. "ఎవ‌రో తెలీదు. ఎక్క‌డ ఉంటారో తెలీదు. కానీ, న‌న్ను పెళ్లి చేసుకుంటాన‌ని పిటిష‌న్ వేశారు. పెళ్లికి ఒప్పుకోక‌పోతే కిడ్నాప్ చేస్తాన‌ని చెప్పి ఆ పిటిష‌న్ వేశాడు. నేను కూడా న్యూస్ లో చూసి న‌వ్వుకున్నాను. నిజానికి అత‌ను ఎవ‌రో నాకు తెలీదు. చాలా అంటే చాలా ఫ‌న్నీగా అనిపించింది. చాలాసేపు న‌వ్వుకున్నాను" అంటూ చెప్పారు సింధూ. 

ఇక ఈ విష‌యాల‌తో పాటు ఆట‌కు సంబంధించిన విష‌యాలు, త‌న కెరీర్, ఫిట్ నెస్ లాంటి ఎన్నో విష‌యాల గురించి ఆ ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు పీవీ సింధూ.  దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు చాలా ఎమోష‌నల్ అనిపిస్తుంద‌ని, చాలా సంద‌ర్భాల్లో నాన్న‌కు కూడా చెప్పేదాన్ని కాద‌ని, ఆయ‌న బాధ‌ప‌డ‌తార‌నే ఉద్దేశంతో చెప్ప‌న‌ని అన్నారు. 

Also Read: 'ఢీ' షోలో ఏడ్చేసిన నందు - చేయ‌ని త‌ప్పుకు బ‌లిచేశార‌ని ఎమోష‌న‌ల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Biker Trailer : రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
రేస్ ఈజ్ రెస్పెక్ట్... వార్ ఆన్ వీల్స్ - శర్వానంద్ బైకర్ ట్రైలర్ వచ్చేసింది
Mrunal Thakur : చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
చరణ్ పెద్దిలో స్పెషల్ సాంగ్ - గ్లోబల్ స్టార్‌తో స్టెప్పులేసే బ్యూటీ ఎవరో తెలుసా?
Niharika Konidela : హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
హీరోగా అకీరా ఎంట్రీ - మెగా డాటర్ నిహారిక కొణిదెల రియాక్షన్
Anchor Suma : సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సుమ బర్త్ డే స్పెషల్ - రాజీవ్ కనకాల ట్వీట్ వైరల్... ఫేమస్ యాంకర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget