అన్వేషించండి

Dhee Celebrity Special: 'ఢీ' షోలో ఏడ్చేసిన నందు - చేయ‌ని త‌ప్పుకు బ‌లిచేశార‌ని ఎమోష‌న‌ల్

Dhee Celebrity Special: 'ఢీ సెల‌బ్రిటీ స్పెష‌ల్' ఎపిసోడ్ ఈ వారం ప్రోమో వ‌చ్చేసింది. ఈ వారం వాలంటైన్స్ డే స్పెష‌ల్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Dhee Celebrity Special Latest Promo: బుల్లితెర‌పై వ‌చ్చే డ్యాన్స్ షోల్లో ఢీ కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంద‌నే చెప్పాలి. ప్ర‌తి సీజ‌న్ ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఢీ సెల‌బ్రిటీ స్పెష‌ల్ టెటికాస్ట్ అవుతోంది. ప్రతి బుధవారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ షో. ఈ షోకి నందు యాంక‌రింగ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ బుధ‌వారం వ్యాలెంటైన్స్ డే కావ‌డంతో.. ల‌వ్  థీమ్ తో ఈ షో చేశారు నిర్వాహ‌కులు. కంటెస్టెంట్స్ అంద‌రూ ల‌వ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేసి ఎంట‌ర్‌టైన్ చేశారు. హైప‌ర్ ఆది శేఖ‌ర్ మాస్టర్ పైన వేసిన జోకులు న‌వ్వు తెప్పించాయి. ప్ర‌తి కంటెస్టెంట్ తో శేఖ‌ర్ మాస్టర్ చేతికి ముద్దులు పెట్టించి ఫ‌న్ క్రియేట్ చేశారు. ఇక త‌న జీవితంలో జ‌రిగిన ఒక ఎమోష‌న‌ల్ మూమెంట్ గురించి త‌ల‌చుకుని షో యాంక‌ర్ నందు క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. 

ఏడ్చేసిన నందు.. 

త‌ను చేయ‌ని త‌ప్పుకు త‌న‌ను బ‌లిచేశార‌ని, చేయ‌లేద‌ని చెప్పినా ఎవ్వ‌రూ క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని ఏడ్చేశారు నందు. నీ జీవితంలో జ‌రిగిన మోస్ట్ ఎమోష‌న‌ల్ మూమెంట్ ఏంటి? అని హైప‌ర్ ఆది అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘నాకు సంబంధం లేని, నా ఇన్వాల్మెంట్ లేని ఒక విష‌యంలో పేరు లాగారు. నా గురించి న్యూస్ లో 12 రోజులు వేశారు. నేను చేయ‌లేద‌ని చెప్పినా ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత నా త‌ప్పు లేదు అని తెలిశాక‌.. జ‌స్ట్ చిన్న స్కోలింగ్ వేసి వ‌దిలేశారు’’ అంటూ ఏడ్చేశారు నందు. నందును ఓదార్చిన హైప‌ర్ ఆది.. ప్రదీప్ అన్న లేడు అని తెలియ‌గానే ఫీల్ అయ్యాం. కానీ, ఆ త‌ర్వాత నువ్వు ఆ  ఫీలింగ్ తీసుకురాకుండా యాంక‌రింగ్ చేస్తున్నావు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.  

Also Read: మురళీమోహన్ నా శత్రువు - రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ద‌ర్..  

ఇక ఈ ప్రోమోలో మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ శేఖ‌ర్ మాస్టర్ త‌ల్లి. ఒక కంటెస్టెంట్ త‌న ప‌ర్ఫామెన్స్ లో ఆమెను కూడా తీసుకొచ్చారు. ఆ త‌ర్వాత శేఖ‌ర్ మాస్టర్, ఆయ‌న త‌ల్లి ఇద్ద‌రు క‌లిసి స్టేజ్ పై స్టెప్పులు వేశారు. త‌ల్లిని మించిన ప్రేమ ఈ ప్ర‌పంచంలో ఉండ‌దు అంటూ శేఖ‌ర్ మాస్టర్ చెప్పిన మాట‌లు క‌న్నీళ్లు తెప్పించాయి అక్క‌డి వాళ్లంద‌రికీ. ఈ ప్ర‌ొమోలో ఇవే కాకుండా.. కొన్ని ఫ‌న్నీ టాస్క్ లు కూడా జ‌రిగాయి. వాలంటైన్స్ డే గురించి, ప్రేమ గురించి చెప్తూ ఎన్నో మంచి ప‌ర్ఫామెన్స్ లు కూడా ఉన్నాయి. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ షో ఫిబ్ర‌వ‌రి 14.. వాలంటైన్స్ డే రోజు ప్ర‌సారం కానుంది. 

Also Read: ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కుమారి ఆంటీ - అథ్లెట్ నందినికి ఆర్థిక సాయం, ఇదిగో ప్రోమో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget