My Name Is Shruthi In OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘మై నేమ్ ఈజ్ శృతి’, హన్సిక కొత్త మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
My Name Is Shruthi In OTT: ఆపిల్ బ్యూటీ హన్సిక రీసెంట్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
My Name Is Shruthi OTT Streaming: సౌత్, నార్త్ అనే తేడా లేకుండా, వచ్చిన ప్రతి అవకాశాన్ని యుటిలైజ్ చేసుకుంటోంది ఆపిల్ బ్యూటీ హన్సిక. భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చినా కాదనకుండా చేసేస్తోంది. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ 16 ఏండ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'దేశముదురు' సినిమాతో హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీ సక్సెస్ తో మరికొన్ని ఛాన్సులు వచ్చాయి. ‘మస్కా’, ‘కందిరీగ’ లాంటి సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు మరింత చేరువయ్యింది. అయితే, ఆమె కెరీర్ కు పెద్దగా బూస్టింగ్ ఇవ్వలేకపోయాయి. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అక్కడ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యింది.
నాలుగేళ్ల తర్వాత తెలుగు సినిమా చేసిన హన్సిక
దాదాపు 4 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న హన్సిక తాజాగా 'మై నేమ్ ఈజ్ శృతి' అనే తెలుగు సినిమా చేసింది. ‘ది హిడెన్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ సినిమాకు శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించారు. స్కిన్ మాఫియా కథాంశంతో రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. ఇప్పటి వరకు మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా గురించి సినిమాలు వచ్చాయి. తొలిసారి మానవ చర్మం అక్రమ రవాణా గురించి ఈ చిత్రంలో చూపించారు. మానవ చర్మం అక్రమ రవాణా ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? దీని వెనుకున్న వ్యక్తులు ఎవరు? అనేది ఇందులో చూపించారు. ఈ సినిమాలో యాడ్ ఏజెన్సీలో పని చేసే శృతి అనే అమ్మాయి పాత్రలో హన్సిక కనిపించింది. స్కిన్ మాఫియా ట్రాప్ లో పడిన ఆమె, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది మూవీ కథ. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. హన్సిక నటనకు మంచి మార్కులు పడినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
View this post on Instagram
సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
ఈ సినిమా విడుదలైన నెలన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి ప్రకటనలు లేకుండా అమెజాన్ ప్రైమ్ లో సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. క్రైమ్ థ్రిలర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీలో మురళీ శర్మ, జయ ప్రకాష్, సాయితేజ, పూజా రామచంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ ఈ సినిమాను నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా, కిశోర్ బోయిడపు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్’ సినిమాల్లో నటిస్తోంది.
#Mynameisshruthi OTT RELEASE NOW @PrimeVideoIN pic.twitter.com/yY4xpxcIra
— OTTGURU (@OTTGURU1) December 29, 2023
Read Also: ‘కుర్చీ మడతపెట్టి..’ సాంగ్ ప్రోమో - ఆ బూతు మాటతో మహేష్ పాట, ఇరగదీసిన శ్రీలీల