అన్వేషించండి

Guntur Karam Movie: ‘కుర్చీ మడతపెట్టి..’ సాంగ్ ప్రోమో - ఆ బూతు మాటతో మహేష్ పాట, ఇరగదీసిన శ్రీలీల

Guntur Karam Movie: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీకి సంబంధించి మెస్మరైజింగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.

Guntur Karam Kurchi Madathapetti Song: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు  ప్రధాన పాత్రలో రూపొందుతున్న మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబోలో మూడో చిత్రంగా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరు కలిసి 'అతడు', 'ఖలేజా' లాంటి చిత్రాలు చేశారు. ‘అతడు’ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోతమోగించగా, ‘ఖలేజా’ మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ‘గుంటూరు కారం’తో బ్లాక్ బస్టర్ అందుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా, ఏమాత్రం తొందర లేకుండా జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారు.   

'గుంటూరు కారం' నుంచి మరో మాస్ మసాలా సాంగ్

మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2021లో షురూ అయ్యింది. కొన్ని అనివార్య కారణాలతో పలు మార్లు షూటింగ్ కు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమలు కూడా షురూ చేసింది చిత్రబృందం. రీసెంట్ గా ‘గుంటూరు కారం’ నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. వీటిలో ఓ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరోపాట ఫర్వాలేదు అనిపించింది. ఈసారి మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని అదిరిపోయే పాటను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ఊరమాస్ సాంగ్ గురించి కీలక ప్రకటన విడుదల చేశారు. 

ఈ నెల 30న 'కుర్చి మడతపెట్టి' సాంగ్ విడుదల

'గుంటూరు కారం' సినిమా నుంచి 'కుర్చి మడతపెట్టి' అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న పూర్తి పాట విడుదల చేయనున్నట్లు చిత్ర బృదం అధికారికంగా వెల్లడించింది. తాజాగా ప్రోమోలో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై ఈ ప్రోమో భారీగా అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ‘కుర్చీ మడతపెట్టి’ అనేది ఒక బూతు మాట. దానితో మహేష్ బాబు పాట ఉంటుందని ఫ్యాన్స్ కూడా అస్సలు ఊహించలేదు. మరి, దీన్ని అభిమానులు ఎలా తీసుకుంటారో చూడాలి.

సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' విడుదల

ఇక 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా రాణిస్తున్న మహేష్  సక్సెస్, ఫెయిల్యూర్ తేడా లేకుండా వరుస సినిమాలతో కెరీర్ కొనసాగిస్తున్నారు. ‘గుంటూరు కారం’ మూవీతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.   

Read Also: ఓవర్ యాక్షన్ ఉండదు, రామ్ చరణ్‌పై ఆలియా కామెంట్స్ - ఆ రోజులను తలచుకుంటూ..

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : జన నాయగన్‌కు విజయ్ రెమ్యునరేషన్ - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
జన నాయగన్‌కు విజయ్ రెమ్యునరేషన్ - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
Nagabandham OTT: నాగబంధం ఓటీటీ రిలీజ్ డేట్... థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ - ఎందులోనంటే? 
థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న నాగబంధం
Ego Raman OTT : రెండు ఓటీటీల్లో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లో లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ - ఎందులో చూడొచ్చంటే?
Trisha Krishnan : జన నాయగన్ చూసిన త్రిష - సినిమా ఎలా ఉంది అని అడిగితే...
జన నాయగన్ చూసిన త్రిష - సినిమా ఎలా ఉంది అని అడిగితే...

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget