News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

మలయాళంలో ఘన విజయం సాధించిన మూవీ 'RDX: రాబర్ట్ డోని జేవియర్'. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయింది.

FOLLOW US: 
Share:

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా అడ్డంకులు తొలగిపోయాయి. అందులోనూ ఓటీటీలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, జనాలు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల సినిమాలను చూడటం అలవాటు చేసుకున్నారు.. కంటెంట్ బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇతర భాషల చిత్రాల అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ 'RDX' (రాబర్ట్ డోని జేవియర్). మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం.. తాజాగా డిజిటల్ వేదిక మీదకు వచ్చేసింది. 

షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఆర్‌డిఎక్స్‌' (RDX). ఇందులో మహిమా నంబియార్, ఐమా సెబాస్టియ్, లాల్, బాబు ఆంటోని, మాలా పార్వతి కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ సినిమా, ఆగస్ట్ 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 8 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ. 84 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీని దెబ్బకు అదే రోజు వచ్చిన దుల్కర్ సల్మాన్‌ 'కింగ్ ఆఫ్‌ కొత్త', నివీన్ పౌలీ 'రామచంద్ర బాస్ & కో' సినిమాలు కూడా సైడ్ అయిపోయాయి. అలాంటి సెన్సేషనల్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

Also Read: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' సినిమాని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్‍ ఫ్లిక్స్ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 24) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూవీ వచ్చే వారం ఓటీటీలోకి వస్తుందని అందరూ భావిస్తుండగా, అంతకంటే ముందుగా సరిగ్గా నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ చేసారు. ప్రస్తుతానికి ఈ మూవీని మలయాళంలో మాత్రమే ప్రసారం చేస్తుండగా.. డబ్బింగ్ వెర్షన్‌లను ఇంకా స్ట్రీమింగ్ చేయలేదు. 

RDX సినిమాని మలయాళంతో పాటుగా మిగతా భాషల డబ్బింగ్ వెర్షన్‌లను స్ట్రీమింగ్ చేస్తారని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తెలుగుతో సహా ఇతర భాషలలోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్‌ ఫ్లిక్స్ సంస్థ ప్రేక్షకులకు హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగానే ఈ మూవీ తెలుగు వెర్షన్ ను స్ట్రీమింగ్ పెట్టే ఛాన్స్ ఉంది. కాకపోతే అప్పటి దాకా వెయిట్ చేయలేని వాళ్ళు సబ్‌ టైటిల్స్‌ తో ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీని చూసేయ్యెచ్చు. 

RDX కథేంటంటే..?
రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోని వర్గీస్) అన్నదమ్ములు. వీళ్ల ఫ్రెండ్ గ్జేవియర్ (నీరజ్ మాధవ్). స్థానిక అకాడమీలో వారి మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ బలంగా టీమ్ ని తయారు చేస్తారు. కానీ ప్రత్యర్థి గ్యాంగ్ తో ఏడ్పడిన గొడవ, కొన్ని సంఘటనలు వారిని విడదీస్తాయి. ఆ ముగ్గురు విడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళీ కలిసారా లేదా? తమ శత్రువులపై పగ తీర్చుకున్నారా లేదా? అనేది RDX స్టోరీ. కామెడీ, యాక్షన్, ఎమోషన్, ఫ్రెండ్‌ షిప్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు కలబోసి ఒక హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దారు. వీకెండ్ బ్లాక్‌ బస్టర్స్ బ్యానర్‌ పై సోఫియా పాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సిఎస్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. 

Also Read:  సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 24 Sep 2023 11:46 PM (IST) Tags: RDX OTT Release RDX Movie RDX: Robert Dony Xavier Nahas Hidayath Shane Nigam Antony Varghese and Neeraj Madhav RDX Telugu Version RDX Movie in Telugu

ఇవి కూడా చూడండి

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Hi Nanna OTT Release: హాయ్ నాన్న ఓటీటీ డీల్ క్లోజ్ - డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?

Hi Nanna OTT Release: హాయ్ నాన్న ఓటీటీ డీల్ క్లోజ్ - డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే?

Animal OTT Release: 'యానిమల్' ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? అసలు నిజం ఏమిటంటే? 

Animal OTT Release: 'యానిమల్' ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? అసలు నిజం ఏమిటంటే? 

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే