News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

ఇటీవల కాలంలో పలువురు హీరో హీరోయిన్లు పెళ్లి పుకార్లతో వార్తల్లో నిలిచారు. వారిలో కొందరు తమపై వైరల్ అవుతున్న రూమర్స్ పై స్పందించగా, మరికొందరు మాత్రం ఎప్పటిలాగే లైట్ తీసుకున్నారు.

FOLLOW US: 
Share:

సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి, వారి గురించే ఎక్కువగా పుకార్లు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల పెళ్లి, ప్రేమ వ్యవహారాలపై పులిహోర కథలు అల్లుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ఇవి మరీ ఎక్కువై పోయాయి. పెళ్లీడుకొచ్చిన అనేక మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఈ మధ్య పుకార్లు షికార్లు చేసాయి. ఒకసారి కాదు అనేకసార్లు సోషల్ మీడియాలోనే పెళ్లిళ్లు చేసేశారు. దీంతో అవన్నీ ఒట్టి రూమర్స్ అని, ఏమాత్రం నిజం లేదని వారే స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి.

త్రిష

సౌత్ స్టార్‌ హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌ త్వరలోనే వివాహం చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో గత కొద్దిరోజులుగా రిలేషన్‌ షిప్ లో ఉందని.. ఇప్పుడు ఏడు అడుగులు నడవడానికి రెడీ అయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది త్రిష దృష్టికి చేరడంతో, సోషల్ మీడియా వేదికగా రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. ''డియర్‌.. మీకు తెలుసు.. మీరు ఎవరో, మీ టీం ఏదో.. ఊరికే ఉండండి.. పుకార్లు పుట్టించొద్దు'' అని ట్వీట్ చేసింది. నిజానికి గతంలోనూ త్రిష మ్యారేజ్ పై అనేకసార్లు రూమర్స్ వచ్చాయి. 2015లో వరుణ్‌ మానియన్‌ అనే బిజినెస్‌ మ్యాన్‌ తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఎందుకో తెలియదు కానీ ఆ పెళ్లి ఆగిపోయింది.

సాయి పల్లవి

రీసెంట్ గా పెళ్లి పుకార్లతో వార్తల్లో నిలిచిన మరో కథానాయిక సాయి పల్లవి. పెళ్లి రూమర్స్ వరకూ పర్వాలేదు కానీ, ఈసారి ఏకంగా ఆల్రెడీ ఒక అబ్బాయితో పెళ్లి జరిగిపోయినట్లు ఒక ఫోటోని కూడా వైరల్ చేసారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో తమిళ సంప్రదాయం ప్రకారం పూల దండలు వేసుకొని ఫోటోలకు ఫోజులివ్వగా.. అందులో పల్లవి - డైరెక్టర్ రాజ్ కుమార్ మాత్రమే కనిపించేలా ఎడిట్ చేసి, వారిద్దరికీ పెళ్లి అయిపోయిందని కొందరు ప్రచారం చేశారు. మామూలుగా రూమర్స్ ను పెద్దగా పట్టించుకోని సాయి పల్లవి, పెళ్లి వార్తలపై ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి రూమర్స్ కి వివరణలు ఇచ్చుకోవాల్సి రావడం చాలా నిరుత్సాహపరిచిందని, ఉద్దేశపూర్వకంగా కావాలని ఇలా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేసింది.

కీర్తి సురేష్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపై చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య దుబాయ్‌ కి చెందిన వ్యాపారవేత్తతో కీర్తి ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అతను తన స్నేహితుడని మహానటి స్పష్టం చేసింది. అంతకముందు మలయాళీ వ్యాపారవేత్తతో మ్యారేజ్ ఫిక్స్ అయిందని టాక్ వచ్చింది. అలానే మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌ తో ప్రేమలో వున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల అవే రూమర్స్ మళ్ళీ వైరల్ అయ్యాయి. ఈ వార్తలను కీర్తి ఖండించింది. అనిరుధ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. ఆమె తండ్రి సురేష్ కుమార్ కూడా కీర్తి - అనిరుధ్‌ పై వస్తున్న వార్తలపై స్పందించారు. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ ఒట్టి పుకార్లని క్లారిటీ ఇచ్చారు. 

అనుష్క

అగ్ర కథానాయిక అనుష్క పెళ్లి గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. 40 ఏళ్ళు దాటినా వివాహ బంధంలో అడుగుపెట్టకపోవడంతో, పుకార్లు ఇంకా ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ అంటే నాకు ఇష్టమే.. కానీ ఆ టైం ఇంకా రావడం లేదు'' అని చెప్పింది. తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ రూమర్స్ తో నిత్యం వార్తల్లో ఉంటుంది. గతంలో హీరో విశాల్‌ తో వరలక్ష్మి ప్రేమాయణం సాగిస్తోందని, వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. తమ మధ్య అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు ఫుల్‌ స్టాప్ పడింది. ఆ తర్వాత వరు ఓ ఫేమస్ క్రికెటర్‌ తో డేటింగ్ చేస్తోందని, పెళ్లికి రెడీ అయిందని కోలీవుడ్ మీడియా వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. కానీ ఏదీ నిజం కాలేదు. 

విశాల్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ విశాల్ అఫైర్స్ గురించి కూడా తరచుగా వార్తలు వినిపిస్తుంటాయి. మొదట్లో వరలక్ష్మి శరత్‌కుమార్ తో రిలేష‌న్ లో ఉన్నాడ‌ని రూమర్స్ వచ్చాయి. అయితే వరలక్ష్మి తనకు ఫ్రెండ్ మాత్రమే అని స్పష్టం చేసాడు. అనీషా రెడ్డితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత లక్ష్మీ మీనన్ తో డేటింగ్ లో ఉన్నాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నార‌ని, త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారన్నారు. లేటెస్టుగా న‌టి అభినయతో విశాల్ ఏడడుగులు వేయబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విశాల్ స్పందించలేదు కానీ, అభినయ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. సినిమాలో భార్యా భర్తలుగా  నటిస్తే, రియల్ లైఫ్ లో కూడా భార్య భర్తలు అవుతారా? అని ప్రశ్నించింది. 

నాగచైతన్య

సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పర్సనల్ లైఫ్ కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ రూమర్స్ పై చై వివరణ ఇచ్చాడు. అయినా సరే వీటికి ఫుల్ స్టాప్ పడటం లేదు. ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బుట్టబొమ్మ ఓ స్టార్‌ క్రికెటర్‌తో ప్రేమాయణం సాగిస్తోందనే ప్రచారం సాగుతోంది. దీనిపై పూజ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Also Read: రాకింగ్ స్టార్ ఈజ్ బ్యాక్ - హోస్ట్ అవతారమెత్తిన మంచువారబ్బాయ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 24 Sep 2023 07:45 PM (IST) Tags: Sai Pallavi Vishal Naga Chaitanya Keerthy Suresh Sobhita Dhulipala Anushka Trisha Krishnan Marriage Rumors Pooja Hegde Abhinaya Marriage Rumors on Celebrities

ఇవి కూడా చూడండి

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు