Connect Movie: అఖిల్ ‘ఏజెంట్’, నయనతార ‘కనెక్ట్’ - దొందూ దొందే!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గత ఏడాది నటించిన 'కనెక్ట్' మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఏజెంట్’ థియేటర్‌లలో ఫ్లాప్ తర్వాత.. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. రోజులు గడుస్తున్నా దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. వాస్తవానికి ‘ఏజెంట్’కు కూడా నయన తార ‘కనెక్ట్’ మూవీ పరిస్థితే ఏర్పడింది. ఎందుకంటే.. ఓటీటీల్లో హర్రర్ మూవీస్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో ‘కనెక్ట్’ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంతా భావించారు. కానీ, ఇప్పటివరకు స్ట్రీమింగ్‌కు నోచుకోలేదు.
కోలీవుడ్ అగ్ర హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార 'కనెక్ట్' అనే మూవీతో చివరగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో నయనతార, సత్యరాజ్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 22న థియేటర్స్ లో విడుదలైంది. హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాకి పృధ్వి చంద్రశేఖర్ సంగీతమందించారు.
కాగా నయనతార ఫ్యాన్స్ 'కనెక్ట్' ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'కనెక్ట్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకున్నప్పటికీ, ఇప్పటివరకు మూవీ స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ నుండి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహానికి సంబంధించి ఓ డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించింది. 'బియాండ్ ది ఫెయిరీ టేల్' పేరుతో ఈ డాక్యుమెంటరీ ని నెట్ ఫ్లిక్స్ ప్రీమియర్ చేయనుంది. అయితే ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ కు సంబంధించి స్ట్రీమింగ్ డేట్ ని కూడా నెట్ ఫిక్స్ అనౌన్స్ చేయలేదు. దాంతో నయనతార అభిమానులు నెట్ ఫ్లిక్స్ సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా 'కనెక్ట్' మూవీకి సంబంధించి కనీసం ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయినా ఇవ్వాల్సిందిగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై నయనతార టీం కానీ.. నెట్ ఫ్లిక్స్ కానీ రాబోయే రోజుల్లో ఏదైనా అప్డేట్ ఇస్తుందేమో చూడాలి. ఇక నయనతార ప్రస్తుతం బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'జవాన్' లో హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ తో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటుంది నయనతార. అంతేకాదు ఈ సినిమాతోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. షారుక్ ఖాన్ - నయనతార కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీ కోసం సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ని సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, సానియా మల్హోత్ర, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తోంది. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార 'జవాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also Read : నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial