News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Dayaa Glimpse : ఈ కళ్ళు ఎవరివో గుర్తు పట్టారా? హాట్‌స్టార్‌లో 'దయ', గ్లింప్స్ వచ్చింది!

డిస్ని ప్లస్ హాట్ స్టార్ నిర్మాణంలో సీనియర్ హీరో జెడి చక్రవర్తి లీడ్ రోల్ లో నటిస్తున్న 'దయ' వెబ్ సిరీస్ నుంచి తాజాగా గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జేడీ చక్రవర్తి. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'శివ' సినిమాతో టాలీవుడ్ కి నటుడుగా ఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి కెరీర్ ఆరంభంలో విలన్ గా నటించారు. ఆ తర్వాత హీరోగా దాని అనంతరం డైరెక్టర్ గా కూడా మారారు. విలన్ పాత్ర నుంచి హీరోగా మారిన జెడి చక్రవర్తి 'గులాబీ', 'బొంబాయి ప్రియుడు', 'సత్య', 'మనీ మనీ', 'అనగనగా ఒక రోజు', 'ఎగిరే పావురమా' వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. అటు దర్శకుడిగాను 'హోమం', 'సిద్ధం', 'మనీ మనీ మోర్ మనీ', 'ఆల్ ది బెస్ట్' వంటి సినిమాలను తెరకెక్కించారు. వీటిలో 'హోమం' దర్శకుడిగా జెడి చక్రవర్తికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక హీరోగా చెడి చక్రవర్తి  ఇండస్ట్రీలో ఎక్కువ కాలం స్టార్ డం ని మైంటైన్ చేయలేకపోయాడు.

దాంతో కొంత కాలం తర్వాత అడపా దడపా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. చివరగా జెడి చక్రవర్తి రెండేళ్ల క్రితం 'ఎం ఎం ఓ ఎఫ్' అనే సినిమాలో లీడ్ రోల్ లో కనిపించారు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈసారి 'దయ' అనే సరికొత్త వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్ గానే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి జె.డి చక్రవర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి తాజాగా ఓ  గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 30 సెకండ్ నిడివి గల ఈ గ్లిమ్స్ వీడియో చూడడానికి ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంది. ముఖ్యంగా ఇందులో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమాంతం ఆకట్టుకుంది. ఇక ఈ వీడియో చివరిలో జేడీ చక్రవర్తి సీరియస్ లుక్ తో చూడటంతో వీడియో ఎండ్ అవుతుంది.

తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ ని బట్టి చూస్తే ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్లిమ్స్ వీడియో విడుదల చేస్తూ త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఈ వెబ్ సిరీస్ ని పవన్ సాదినేని అనే యంగ్ డైరెక్టర్ తనకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ డైరెక్టర్ 'ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి', 'సేనాపతి' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో జేడి చక్రవర్తి లీడ్ రోల్ చేస్తుండగా.. హీరోయిన్ ఈషా రెబ్బ, కమల్ కామరాజు, రమ్య నంబేసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  '

పిట్టకథలు', 'త్రీ రోజెస్' వంటి తెలుగు వెబ్ సిరీస్ ల తర్వాత ఈషా రెబ్బ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. అలాగే జేడీ చక్రవర్తి నటిస్తున్న మొదటి తెలుగు వెబ్ సిరీస్ కూడా ఇదే. ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈషా రెబ్బ కూడా ప్రాముఖ్యత ఉన్న పోషిస్తున్నట్లు సమాచారం. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం సహా ఇతర భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read : తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టే కొడుకు వైఎస్ జగన్ - అదే 'యాత్ర 2'

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 08 Jul 2023 05:35 PM (IST) Tags: JD Chakravarthi Daya Dayaa Web Series Dayaa Glimps Video JD Chakravarthi Dayaa Web Series

ఇవి కూడా చూడండి

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

Upcoming OTT Movies: ఈవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి, ఓటీటీలో ఏకంగా 35కు పైగా చిత్రాల విడుదల

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

RDX OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగులో ఎప్పుడంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

DD Returns: తెలుగులో సంతానం తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోందంటే?

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kushi OTT Release Date: 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?