Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్
where to watch Basic Instinct : ఊహించని కథ, కథనాలు, బోల్డ్ సీన్లతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన బేసిక్ ఇన్‌స్టింక్ట్ ఇన్నేళ్లకు ఓటీటీలో వచ్చింది. తక్కువ బడ్జెట్‌తో తీసిన రికార్డులు తిరగరాసింది.
Basic Instinct OTT India: బేసిక్ ఇన్స్టింక్ట్ ( Basic Instinct ) ఈ సినిమా పేరు చెబితే చాలు 90's ప్రేక్షకులకు ఎమోషన్ కలుగుతుంది. అప్పట్లో ఒక రకమైన ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది. చాలా లో బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా షారోన్ స్టోన్ ను రాత్రికి రాత్రి వెండి తెర శృంగార దేవతగా మార్చేసింది. మగవాళ్ళ సంగతి సరే ఆడవాళ్ళ సైతం షారోన్ స్టోన్ వేసిన డ్రస్సులు, వాకింగ్ స్టైల్ అనుకరించడానికి ప్రయత్నించేవారు.
ఆ సినిమాలో హీరో మైకేల్ డగ్లస్, షారోన్ మధ్య చిత్రీకరించిన బోల్డ్ సన్నివేశాలకు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోనే అంతకు ముందు ఎన్నడూ లేనంత పాపులారిటీ వచ్చింది. అదేవిధంగా ఆ సినిమాను బ్యాన్ చేయాలంటూ చాలా నిరసనలు కూడా జరిగాయి. సినిమా షూటింగ్ కూడా చాలా సార్లు ఆగిపోయింది. చాలామంది హీరోయిన్లు ఈ సినిమా చేయమంటూ తేల్చి చెప్పేయడంతో అప్పటికి అంతగా పాపులర్ కాని షారోన్ స్టోన్ ను హీరోయిన్ గా బుక్ చేశారు. పాల్ వేరొవెన్ డైరెక్షన్‌లో 1992 లో విడుదలైన బేసిక్ ఇన్స్టింక్ట్ జస్ట్ 49 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందింది. సినిమా రిలీజ్ అయ్యాక అన్నీ నెగిటివ్ రివ్యూలే. కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. ఏకంగా 352మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఆ సినిమాలోని బోల్డ్ సన్నివేశాలను మాస్టర్ పీస్ గా చెబుతుంటారు.
కథ ఏంటంటే..?
శాన్ ఫ్రాన్సిస్కో లో ఒక రిటైర్డ్ రాక్ స్టార్ హత్యను డిటెక్టివ్‌లు నిక్, గస్ మొరన్ ఇన్వెస్ట్ గేట్ చేస్తుంటారు. ఆ హత్య జరిగిన విధానం అచ్చం కేథరిన్ ట్రామెల్ అనే రచయిత రాసిన నవలలో ఉన్నట్టు ఉండడంతో ఆమెను ప్రశ్నిస్తారు. కానీ ఆధారం లేక వదిలేయాల్సి వస్తుంది. మరికొన్ని హత్యలు ఆమె రాసిన నవలల్లో ఉన్నట్టు జరగడంతో నిక్ ఆమె మీద అనుమానంతో ఆమె వెంట పడతాడు. ఒకానొక దశలో ఆమెతో ప్రేమలో పడతాడు. కేథరిన్ కూడా నిక్ తో ప్రేమలో ఉన్నట్టే కనిపిస్తుంది. ఆ తర్వాత సినిమా అనేక మలుపులు తిరిగి ఒక ఊహించని ట్విస్ట్ తో ముగుస్తుంది.
సినిమాలో అనేక బోల్డ్ సన్నివేశాలను చాలా వివరంగా చిత్రీకరించడంతో అప్పట్లో విపరీతమైన విమర్శలు వచ్చాయి.అయినా జనం మాత్రం సినిమాని హిట్ చేశారు. ఈ సినిమా సాధించిన విజయం చూసి తర్వాత చాలామంది ఇలాంటి కథలతోనే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. వాటిలో కొన్ని హిట్ అయినా బేసిక్ ఇన్స్టింక్ట్ స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయాయి. అంతెందుకు 2014లో షారోన్ స్టోన్ తోనే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ తీసినా అది పెద్దగా సక్సెస్ కాలేదు.
ఏ OTT లో చూడాలి
బేసిక్ ఇన్స్టింక్ట్ ఇటీవల వరకూ ఏ ఓటిటిలోనూ అందుబాటులో ఉండేది కాదు. ఒకటి రెండు సైట్లో ఉన్నా ఎక్కువ రేటు పెట్టి చూడాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చారు. రసిక ప్రియలూ ఇంకెందుకు ఆలస్యం.. ఓ లుక్కేసేయండి.
Also Read: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?