The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ - ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చ అంటే?
Rana Daggubati: రానా దగ్గుబాటి రెండవ టాక్ షో 'ది రానా దగ్గుబాటి షో' ఫస్ట్ ఎపిసోడ్ కు అమెజాన్ ప్రైమ్ వీడియో ముహూర్తం ఖరారు చేసింది. ఆ ఎపిసోడ్ ఎప్పుడు రాబోతోందో తెలుసుకుందాం పదండి.

టాలీవుడ్ హల్క్ గా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రానా (Rana Daggubati)కు దేశవ్యాప్తంగా మంచి క్రేజీ ఉన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' సినిమాతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ఇక రీసెంట్ గా రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓటీటీలో కూడా అదరగొట్టారు రానా. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ టాక్ షో చేయడానికి సిద్ధమయ్యారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో 'ది రానా టాక్ షో' అనే పేరుతో ఈ షోను హోస్ట్ చేయబోతున్నారు రానా. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఎపిసోడ్ ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేయబోతున్నారో అఫీషియల్ గా వెల్లడించారు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు.
రానా దగ్గుబాటి స్వయంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ హోస్ట్ చేస్తున్నారు 'ది రానా టాక్ షో'ను. ఫస్ట్ ఎపిసోడ్ ఈ ఏడాది నవంబర్ 23న స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ దగ్గుబాటి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రైమ్ వీడియో. కానీ ఫస్ట్ ఎపిసోడ్ లో పాల్గొననున్న సెలబ్రిటీ పేరును మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఈ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఇదొక అన్ స్క్రిప్టెడ్ టాక్ షో అని తెలుస్తోంది. మొత్తం 8 ఎపిసోడ్ లు ఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక 'ది రానా దగ్గుబాటి షో'కు, దర్శక దిగ్గజం రాజమౌళి, నాని, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, ఆర్జీవి, శ్రీ లీల, సిద్దు జొన్నలగడ్డ తదితరులుగా హాజరు కాబోతున్నట్టు టాక్ నడుస్తోంది.
The stars you know, the stories you don’t✨🤭
— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024
Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z
అయితే రానా ఇలా ఒక సెలబ్రిటీ టాక్ షోను హోస్ట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఆయన 'నంబర్ వన్ యారి' అనే పేరుతో ఒక టాక్ షోను నడిపించారు. ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ అయిన ఈ షోలో అప్పట్లో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇక ఇప్పుడు 'ది రానా దగ్గుబాటి షో'లో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ షోను భారతదేశంతో పాటు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో నవంబర్ 23 నుంచి ప్రైమ్ వీడియో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ చేయనుంది. ప్రతీ శనివారం కొత్త ఎపిసోడ్ లను రిలీజ్ చేస్తారు.
అయితే ఇప్పటికే బాలీవుడ్లో 'కాఫీ విత్ కరణ్' అనే షోను కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగులో 'అన్ స్టాపబుల్' పేరుతో బాలయ్య ఆహాలో మరో సెలబ్రిటీ టాక్ షో చేస్తున్నారు. ఇక ఇప్పుడు రానా చేయబోయే 'ది రానా దగ్గుబాటి షో' ఈ రెండు టాక్ షోలకు గట్టి పోటీని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా రానా రీసెంట్ గా 'వేట్టయన్' అనే రజినీ తమిళ సినిమాలో కీలకపాత్రను పోషించారు. అలాగే మరోవైపు 'రానా నాయుడు' సీక్వెల్లో కూడా నటిస్తున్నారు. ఈ రెండింటితో పాటు దుల్కర్ సల్మాన్ తో కలిసి మరో మల్టీస్టారర్ మూవీని చేస్తున్నారు. రానా.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















