అన్వేషించండి

Annapoorani OTT: ‘నెట్‌ఫ్లిక్స్’లో నుంచి ‘అన్నపూర్ణి’ ఔట్ - కానీ, ఓటీటీలో మాత్రం ఇంకా స్ట్రీమింగ్, ఓ ట్విస్ట్ ఉంది

Annapoorani OTT: నయనతార హీరోయిన్‌గా నటించిన ‘అన్నపూర్ణి’ని పలువురు ప్రేక్షకులు ఖండించి నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించేలా చేశారు. అయినా కూడా మరో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ మూవీ ఇంకా స్ట్రీమ్ అవుతోంది.

Annapoorani OTT: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్‌లో 75వ చిత్రం అనేది ఒక ల్యాండ్‌మార్క్‌లాగా గుర్తుండి పోవాల్సింది. కానీ అలా జరగలేదు. తన కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘అన్నపూర్ణి’ సినిమా ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. ముందుగా దీనిని థియేటర్లలో విడుదల చేయకుండా ఆపమని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో ఒక విధంగా మేకర్స్.. దీనిని థియేటర్లలో విడుదల చేసి.. ఆ తర్వాత ఓటీటీ వరకు తీసుకొచ్చారు. కానీ ఓటీటీలో నుంచి కూడా దీనిని తొలగించమని ఒత్తిడి మొదలయ్యింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని తొలగించింది. అయినా కూడా మరో ఓటీటీలో ‘అన్నపూర్ణి’ అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.

వేరే దారి లేక..
డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలయ్యింది ‘అన్నపూర్ణి’. ఆ తర్వాత కొన్నిరోజులకు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యిందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అప్పటినుంచే మూవీని ఓటీటీలో స్ట్రీమ్ చేయవద్దని నెట్‌ఫ్లిక్స్‌పై ఒత్తిడి మొదలయ్యింది. అయినా పట్టించుకోకుండా స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. దాదాపు వారం రోజులపాటు ‘అన్నపూర్ణి’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది. కేవలం తమిళంలోనే కాకుండా ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా.. సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి నెట్‌ఫ్లిక్స్‌పై ఒత్తిడి మరింత పెరిగిపోయింది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతా కలిసి ‘అన్నపూర్ణి’ని సోషల్ మీడియాలో ఖండించడం మొదలుపెట్టారు. దీంతో నెట్‌ఫ్లిక్స్‌కు వేరే దారిలేక సినిమాను స్ట్రీమింగ్ నుంచి తొలగించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో కాకుండా..
నయనతార సినిమా స్ట్రీమింగ్ నుంచి తొలగించడంతో తన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేసిన ఈ సినిమా.. ‘సింప్లీ సౌత్’ అనే ఓటీటీలో ఇంకా స్ట్రీమ్ అవుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉండే మూవీ లవర్స్‌కు అందుబాటులో ఉండే ఓటీటీ ప్లాట్‌ఫార్మే ఈ సింప్లీ సౌత్. ఇక ఈ ఓటీటీలో ‘అన్నపూర్ణి’ మూవీ కేవలం తమిళంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. మరి ఈ మూవీని ఖండించిన ప్రేక్షకులకు ఈ స్ట్రీమింగ్ గురించి తెలిస్తే.. ఇంకా ఏం చేస్తారో అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘అన్నపూర్ణి’లో నయనతారకు జోడీగా జై నటించాడు.

జీ స్టూడియోస్ క్షమాపణ..
సత్యరాజ్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్‌లే, అచ్యుత్ కుమార్, కుమార్ సాచు, రేణుక, కార్తిక్ కుమార్, సురేశ్ చక్రవర్తిలాంటి నటీనటులు ‘అన్నపూర్ణి’లో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక ‘అన్నపూర్ణి’ని యాంటీ హిందూ ఫిల్మ్ అని ముద్ర వేసి.. దీనిని నిర్మించిన నిర్మాణ సంస్థలపై కూడా కొందరు ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. దీంతో వారందరికీ క్షమాపణ చెప్పడానికి జీ స్టూడియోస్ ముందుకొచ్చింది. ఈ మూవీ ట్రైలర్ విడుదల అవ్వగానే ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని, బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా ఉందని ఆందోళన మొదలయ్యింది.

Also Read: ప్రశాంత్ వర్మ, తేజ ఎవరో తెలీదు, ‘హనుమాన్’పై అంచనాలు లేవు - వరలక్ష్మి శరత్‌కుమార్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget