అన్వేషించండి

Varalaxmi Sarathkumar: ప్రశాంత్ వర్మ, తేజ ఎవరో తెలీదు, ‘హనుమాన్’పై అంచనాలు లేవు - వరలక్ష్మి శరత్‌కుమార్

Varalaxmi Sarathkumar: ‘హనుమాన్’లో తేజకు అక్కగా నటించి ప్రేక్షకులను మరోసారి తన నటనతో మెప్పించింది వరలక్ష్మి. కానీ సినిమాకు ముందు అసలు ప్రశాంత్, తేజ ఎవరో కూడా తనకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Varalaxmi Sarathkumar about HanuMan: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ గురించి అంతటా పాజిటివ్ రివ్యూలు వినిపిస్తున్నాయి. ఇంత తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి.. తమ సినిమా మీద నమ్మకంతో సంక్రాంతి బరిలో దిగడం మామూలు విషయం కాదని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. సూపర్ హీరో జోనర్‌కు తగినట్టుగానే విజువల్ వండర్‌లాగా ఉందని చెప్తున్నారు. ఇక ఈ మూవీలో తేజ సజ్జాతో పాటు మరో కీలక పాత్రలో నటించింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఇందులో హీరోకు అక్కగా నటించిన వరలక్ష్మి నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా తన పాల్గొన్న ఇంటర్వ్యూలో అసలు ఈ సినిమాను తను ఎందుకు ఒప్పుకున్నాననే విషయాన్ని బయటపెట్టింది.

బాలయ్యకు చెల్లి పాత్ర అంటే వేరే లెవెల్

‘‘ఫస్ట్ డే షూటింగ్‌కు ఎప్పుడూ ఒక మూడ్‌లో వెళ్తాం. ఒక కొత్త సినిమా, కొత్త టీమ్ అని తప్పా పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ తీసుకోము. కేవలం మన క్యారెక్టర్ మీదే మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సినిమా వైబ్ ఎలా ఉంటుందని తెలియదు’’ అని తన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తుండగానే తేజ సజ్జా మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ‘‘ఒక 6, 7 పెద్ద సినిమాల మధ్యలో మా చిన్న సినిమా వచ్చింది. ఏముంటది ఇంట్రెస్ట్? సరే చూద్దాం, చేద్దాం అనుకున్నారు’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఆ మాటకు వరలక్ష్మి ఒప్పుకోలేదు. ‘‘మామూలుగా అక్క, చెల్లి పాత్ర చేయాలంటే ఒక విధమైన ఆలోచనలో ఉండిపోతాం. ఎందుకంటే బాలయ్యకు సిస్టర్ క్యారెక్టర్ చేస్తే అదే వేరే లెవెల్‌లో రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ అలా ఉండదు అనుకున్నాను’’ అంటూ ‘హనుమాన్’ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు తన ఆలోచన ఎలా ఉందో బయటపెట్టదింది వరలక్ష్మి.

సినిమాపై అంచనాలు లేవు

‘‘అప్పటికి నాకు డైరెక్టర్ ఎవరో తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే తేజ ఎవరో కూడా తెలియదు. కానీ కథ వినగానే లోపల ఒక ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా చేయాలి అని. నేను వెంటనే వినయ్‌కు ఫోన్ చేసి కథ వినమని, బాగుందని చెప్పాను. అదేంటో తెలియదు కానీ ఒక ఫీలింగ్ వచ్చింది. చివరిసారి ‘విక్రమ్ వేద’ కథ విన్నప్పుడు ఇదే ఫీలింగ్ వచ్చింది. ‘విక్రమ్ వేద’ ఒక కల్ట్ సినిమాలాగా మారిపోయింది. అప్పుడు కూడా ఎందుకు ఈ సినిమా చేస్తున్నావు చేయొద్దు అని చెప్పారు. ఈ సినిమా గురించి కూడా మొదట్లో అందరూ అలాగే ఫీలయ్యారు, ఎందుకు అక్కగా చేస్తున్నావని అడిగారు. అలా షూటింగ్ స్టార్ట్ అయ్యింది, వెళ్తోంది. సినిమా బాగా వస్తుంది అని అనుకున్నాను. అందరితో టీమ్‌గా చాలా క్లోజ్ అయ్యాను. నిజంగా టీజర్ చూసేవరకు సినిమాపై అంత అంచనా లేదు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత నా నిర్ణయం కరెక్ట్ అనిపించింది. నిజంగానే సినిమా వేరే లెవెల్‌కు వెళ్లిపోయింది. ఈ సినిమాలో చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను’’ అని తెలిపింది వరలక్ష్మి శరత్‌కుమార్.

రెండేళ్ల క్రితమే

‘హనుమాన్’ మూవీని రెండేళ్ల క్రితమే ప్రారంభించారు మేకర్స్. అప్పుడే వరలక్ష్మి శరత్‌కుమార్‌కు కూడా కథను వినిపించారు. కానీ పలు కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతూనే వచ్చింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వరలక్ష్మి పర్సనాలిటీలో మార్పులు వచ్చాయి. ‘హనుమాన్’ షూటింగ్ సమయంలో తన షెడ్యూల్స్ మారుతున్నాకొద్దీ తన పర్సనాలిటీలో తేడాలు కనిపించాయని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. అప్పుడు లావుగా ఉన్నానని, ఇప్పుడు చాలా బక్కగా అయ్యానని తెలిపింది. కానీ స్క్రీన్‌పై మొత్తంగా చూసుకున్నప్పుడు పెద్దగా తేడా తెలియడం లేదని తేజ అన్నాడు.

Also Read: రాజమౌళి వల్లే ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశా - ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget