Amazon Prime: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాక్, సబ్ స్క్రిప్షన్ ధరలు భారీగా పెంపు, వారికి మాత్రం మినహాయింపు!
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ అమెజన్ ప్రైమ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. భారత్ లో సబ్ స్క్రిప్షన్ ధరను పెంచింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భారత్ లో సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. నెల వారి సబ్ స్క్రిప్షన్ ఫ్లాన్ ధరలను ఏకంగా 67 శాతానికి పైగా పెంచింది. అయితే, ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ ఉన్నవాళ్లు వచ్చే ఏడాది(2024) జనవరి 15 వరకు పాత రేట్లతో చూసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. నెల, మూడు నెలల ప్లాన్ల ధరలను పెంచిన అమెజాన్, ఏడాది ఫ్లాన్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు.
పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే?
అమెజాన్ ప్రైమ్ నెల వారి ఫ్లాన్ గతంలో రూ. 179 రూపాయలు ఉండేది. ప్రస్తుతం ఏకంగా రూ.299కి పెంచింది. నెలకు ఏకంగా రూ.120 రూపాయలు పెంచడం పట్ల వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఇక మూడు నెలల ఫ్లాన్ విషయానికి వస్తే గతంలో రూ. 459 ఉండగా, ప్రస్తుతం రూ. 599కు చేరింది. అయితే, ఏడాది ఫ్లాన్ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఉన్న రూ. 1499 అలాగే కొనసాగుతుందని ప్రకటించింది. అలాగే వార్షిక ప్రైమ్ లైట్ ప్లాన్ ధర రూ. 999గా కొనసాగుతుంది. అయితే, ఇప్పటికే ఉన్న సభ్యులు తమ సబ్‌స్క్రిప్షన్‌ను పాత ధరలకే కొనసాగించవచ్చని తెలిపింది. కొత్త సభ్యులు మాత్రం సవరించిన ధరలను చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి అమెజాన్ ప్రైమ్ ఫ్లాన్ ధరలను పెంచడం ఇదే తొలిసారి కాదు. 2021లో నెల వారి ప్లాన్ ధర రూ. 120 ఉండగా దానిని రూ. 179కి పెంచింది.
2016 నుంచి అందుబాటులోకి అమెజాన్ ప్రైమ్ సేవలు
2016లో అమెజాన్ ప్రైమ్ సేవలు భారత్ లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, 2018 నుంచి నెలవారీ రుసుము వసూలు చేయడం మొదలు పెట్టింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌కు ఉచిత యాక్సెస్ ఉండేది. వారికి వేగంగా వస్తువులను డెలివరీ చేయడంతో పాటు నిర్దిష్ట ఉత్పత్తులపై ప్రత్యేక తగ్గింపులతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సభ్యులు ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్, అమెజాన్ ఫ్యామిలీకి కూడా యాక్సెస్ అందిస్తుంది. పెరిగిన ధరల పట్ల పలువురు అమెజాన్ ప్రైమ్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం పెరిగిన ధరల కారణంగా దాని సేవలు మెరుగుపడుతాయని చెప్తున్నారు.
పెరిగిన డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్న ఓటీటీలు
వాస్తవానికి కరోనా తర్వాత ఓటీటీ ఫ్లామ్ ఫారమ్స్ కు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పెద్ద పెద్ద సినిమాలు సైతం నెలకు అటు ఇటుగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక చిన్న సినిమాలు 10, 15 రోజుల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది థియేటర్లకు వెళ్లకుండానే నేరుగా ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఫ్లాన్ ధరలను భారీగా పెంచుతున్నాయి.
Read Also: ప్రియాంక చోప్రా హై బడ్జెట్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఎలా ఉంది?