Alappuzha Gymkhana Telugu OTT: మరో ఓటీటీలోకి 'అలప్పుజా జింఖానా'... SonyLiv కాదు, తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లోకి!
Alappuzha Gymkhana On OTT: మలయాళ రీసెంట్ హిట్ 'అలప్పుజా జింఖానా' ఆల్రెడీ సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలోకి రానుంది.

'ప్రేమలు' సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన మలయాళ హీరో నస్లీన్. అతను ఒక హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'అలప్పుజా జింఖానా'. కేరళతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంది. మలయాళ ఆడియన్స్ నుంచి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో సినిమాను విడుదల చేశారు. అయితే థియేటర్లలో మినిమమ్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీలోకి రానుంది.
త్వరలో ఆహాలోనూ జింఖానా రిలీజ్!
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో 'అలప్పుజా జింఖానా' స్ట్రీమింగ్ అవుతోంది. అతి త్వరలో తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలోకి కూడా అందుబాటులోకి రానుంది.
Also Read: మహేష్ బాబు కుర్చీ మడత పెడితే... ప్రభాస్ జాతిని?
Laughter in every punch 😎
— Suresh PRO (@SureshPRO_) June 17, 2025
#AlappuzhaGymkhana coming soon on #aha @ahavideoIN #AlappuzhaGymkhanaOnAha #Naslen pic.twitter.com/BIy9cIkcuu
సినిమా కథ ఏమిటి? ఎలా ఉంటుంది?
సింపుల్ కథతో రూపొందిన సినిమా 'అలప్పుజా జింఖానా'. ఇంటర్ ఫెయిల్ అయిన కుర్రాళ్ళు కొంత మంది స్పోర్ట్స్ కోటాలో డిగ్రీ కాలేజీలో సీటు సంపాదించాలని జింఖానాలో జాయిన్ అవుతారు. అక్కడ బాక్సింగ్ నేర్చుకుంటారు. వాళ్ళతో పాటు ఆ జింఖానాలోని మరో ముగ్గురు జిల్లా స్థాయిలోని పోటీలలో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలకు వెళతారు. అక్కడ ఆ కుర్రాళ్ళకు కోచింగ్ ఇచ్చిన వ్యక్తిని ఒకరు అవమానిస్తారు. ఆ తర్వాత కుర్రాళ్లకు సైతం అవమానం ఎదురు అవుతుంది. అప్పుడు ఏమైంది? ఏమిటి? అనేది సినిమా.
Also Read: రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీ డీల్ క్లోజ్... ఆల్రెడీ సెంచరీ దాటించిన గ్లోబల్ స్టార్
'అలప్పుజా జింఖానా' సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... యూత్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న దర్శకుడు ఖలీద్ రెహమాన్ వాళ్ళను ఆకట్టుకునే విధంగా సినిమా రూపొందించారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మీమ్ లాంగ్వేజ్, ట్రెండింగ్ పదాలు పట్టుకుని డైలాగ్స్ రాశారు. ఓటీటీలో కూడా ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేసే చిత్రమిది.





















