News
News
X

OTT Releases: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే - డోన్ట్ మిస్

ఈ వారం ఓటీటీ, థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే. పలు వెబ్ సీరిస్‌లు కూడా విడుదల కానున్నాయి.

FOLLOW US: 

తంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఏ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి? అని జనాలు ఆరా తీసేవారు.. తమకు నచ్చిన సినిమాలకు వెల్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి  మారిపోయింది. థియేటర్ మాత్రమే కాదు.. ఈ వారం ఏ ఓటీటీలో ఏ సినిమా, వెబ్ సీరిస్  విడుదల అవుతుంది? అని వెతుకుతున్నారు. అంతేకాదు..  థియేటర్లతో పోల్చితే ఓటీటీల్లో సినిమాలు చూసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. థియేటర్లో సినిమాలు చూడాలంటే బోలెడు ఖర్చు.. అదే ఓటీటీలో అయితే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఏ సమయంలోనైనా చూడొచ్చు. ఎక్కడైనా చూడొచ్చు. ఎన్నో విధాలు సౌకర్యంగా ఉన్న ఓటీటీకే జనాలు జై కొడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ-2’ మళ్లీ థియేటర్లకు పూర్వ వైభవం తెచ్చాయి. మరి, ఈ వారం విడుదలయ్యే సినిమాలకు ఆ అవకాశం ఉంటుందా? ముందుగా ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఏమిటో చూద్దాం.

టాప్‌గన్‌ మార్వెరిక్‌ - ఆగస్టు 24 (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన టాప్ గన్: మావెరిక్ 2022లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది.  ఈ యాక్షన్ డ్రామా మూవీ ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర దాదాపు $1.4 బిలియన్లను వసూలు చేసింది. పీట్ మార్వెరిక్‌ మిచెల్ (టామ్ క్రూజ్) అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్. ఒక యుద్ధ విమానాన్ని టెస్ట్ చేసే క్రమంలో పరిమితికి మించిన వేగంతో వెళతాడు. ఆ తర్వాత అతడిని టెస్ట్ పైలట్ విధుల నుంచి తప్పించి... 'టాప్ గన్' అకాడమీలో బెస్ట్ పైలట్స్‌కు శిక్షణ ఇవ్వమని పంపిస్తారు. శిక్షణ ఇచ్చే క్రమంలో పీట్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు. టాప్ గన్: మార్విక్ ఆగస్ట్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంటుంది.

సమరిటన్‌ - ఆగస్టు 26 (అమెజాన్ ప్రైమ్)

సమరిటన్ ఆగస్టు 26న అమెజాన్ ప్రైమ్  వీడియోలో అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రానికి జూలియస్ అవెరీ దర్శకత్వం వహించారు

కట్‌పుట్లి - సెప్టెంబర్‌ 2 (డిస్నీ హాట్ స్టార్)

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్‌పుట్లి’ సెప్టెంబర్ 2న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌ లో రిలీజ్ కానుంది. తమిళంలో సూపర్ హిట్టయి. ఆ తర్వాత తెలుగులో రీమేకై.. ఇక్కడా విజయవంతమై ‘రాక్షసుడు’ సినిమానే ఈ ‘కట్‌పుట్లి. తమిళంలో విష్ణు విశాల్, తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన పాత్రను అక్షయ్ హిందీలో చేశాడు. అక్షయ్‌తో ‘బెల్ బాటం’ చిత్రాన్ని తెరకెక్కకించిన రంజిత్ తివారి ఈ సినిమాను  తీశాడు. సెప్టెంబరు 2న హాట్ స్టార్‌లో ఈ సినిమా విడుదల కానుంది.  

ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2 - ఆగస్టు 26 (నెట్ ఫ్లిక్స్)

షెఫాలీషా ప్రధాన పాత్రలో నటించిన ఢిల్లీ క్రైమ్‌ వెబ్ డ్రామా అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తొలి సీజన్ దేశ వ్యాప్తంగా భారీ స్పందనని సొంతం చేసుకోవడమే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అత్యంత పాపులర్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ఢిల్లీ క్రైమ్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ రెండవ భాగం ఆగస్టు 26న నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కాబోతోంది.    ఢిల్లీలో సంచలనం సృష్టించిన క్రైమ్ ని డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీషా) నేతృత్వంలోని పోలీసుల బృందం ఎలా పరిష్కరించింది? అనే ఆసక్తికరమైన కథ, కథనాలతో సీరీస్ 2 సాగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా సిరీస్ లో షెఫాలీషా కీలక పాత్రలో నటించగా ఇతర పాత్రల్లో రసిక దుగల్ ఆదిల్ హుస్సేన్ ఆకాష్ దహియా తదితరులు నటించారు. రిచీ మోహతా డైరెక్ట్ చేశారు.   

థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే: 

లైగర్: ఈ వారం థియేటర్‌లో విడుదలవుతున్న భారీ చిత్రం ‘లైగర్’ మాత్రమే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘లైగర్’ విడుదల కానుంది. 

ఆగస్టు 26న చిన్న చిత్రాల హావా: ‘లైగర్’ విడుదలైన తర్వాతి రోజు భలా చోర భళా, కళాపురం, పీకే వంటి చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే, ఎన్ని థియేటర్లలో ఈ చిత్రాలు విడుదలవుతాయనేది స్పష్టతలేదు. కార్తికేయ-2, సీతారామం సినిమాలకు ఇంకా కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఈ వారం కూడా షోస్ కొనసాగించే అవకాశం ఉంది. 

Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?

Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?

Published at : 22 Aug 2022 08:52 PM (IST) Tags: OTT releases New Movie Releases August Month Movies August Month OTT Releases

సంబంధిత కథనాలు

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

Janaki Kalaganaledu October 3rd: ఎగ్జామ్ లో అదరగొట్టిన జానకి- జ్ఞానంబ ఇంట్లో మొదలైన శరన్నవరాత్రుల పూజ, చెడగొట్టేందుకు సిద్ధమైన మల్లిక

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్