News
News
X

Chiranjeevi : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?

మెగాస్టార్ చిరంజీవి నటుడా? కథానాయకుడా? వెండితెర వేల్పుగా ఎంతో మందిని అలరిస్తున్న ఆయన జీవితంలో అదొక్కటీ లోటుగా మారిందా? అభిమానుల కోసం చేసిన చిరు త్యాగం లోటుగా మారిందా? అన్యాయం జరిగిందా? మీరే చదవండి!

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి...
నటుడా? కథానాయకుడా?
ఆయనలో నటుడు ఉన్నాడు!
అయితే... ఆ నటుడిని హీరో డామినేట్ చేశాడా?
కథానాయకులకు కొన్ని పరిమితులు ఉంటాయ్!
ఆ పరిమితులు చిరంజీవిలో నటుడికి ప్రతిబంధకాలు వేశాయా?
అనేది ఇక్కడ ప్రశ్న!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటుడా? కథానాయకుడా? కింగ్ అక్కినేని నాగార్జున మాటల్లో చెప్పాలంటే... నిస్సందేహంగా కథానాయకుడు! మాస్‌కు, తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎప్పుడూ మెగాస్టారే! పాటలు, ఫైట్లు లేకపోతే మెగాస్టార్ మూవీని జనాలు చూడరని అనేశారు. 'లాల్ సింగ్ చడ్డా' ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవితో కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన సినిమా చేయాలనుందని చెప్పిన ఆమిర్ ఖాన్... అందులో సాంగ్స్, యాక్షన్ ఉండవన్నారు. నాగార్జున వెంటనే ''యాక్షన్ (ఫైట్లు), డ్యాన్సులకు చిరంజీవి ప్రసిద్ధి. ప్రేక్షకులు అందుకే ఆయన్ను ప్రేమిస్తారు'' అని తెలిపారు. రాంగ్ ఫిల్మ్ ఎంపిక చేసుకుంటారని ఆమిర్ ఖాన్‌కు చెప్పేశారు.

నిజమే... చిరంజీవి అంటే డ్యాన్స్! మెగాస్టార్ స్టెప్స్, మూమెంట్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. డ్యాన్స్ చూసి ఆయనకు అభిమానులుగా మారిన ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. డ్యాన్స్‌లో చిరంజీవి తమకు స్ఫూర్తి అని చెప్పిన హీరోలూ ఉన్నారు. చిరు అంటే మాస్! ఫైట్స్‌లో మెగాస్టార్‌ది సపరేట్ స్టైల్. డూప్ లేకుండా చేశారు. వేగం చూపించారు. నిజం చెప్పాలంటే... అప్పటి వరకూ ఉన్న హీరోల మధ్య చిరంజీవిని ప్రత్యేకంగా నిలిపింది ఆయన డ్యాన్సులు, ఫైట్లే.

చిరంజీవి అంటే డ్యాన్సులు, ఫైట్లు మాత్రమేనా?
అంటే... కానే కాదు! అంతకు మించిన ప్రతిభ ఆయనలో ఉంది. అందుకు వెండితెర సాక్ష్యంగా నిలిచింది. మెగాస్టార్ మాస్ గురించి చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. 'ఖైదీ' నుంచి 'ఠాగూర్' వరకూ ఎన్నో కళ్ళ ముందు మెదులుతాయి. మరి, మెగాస్టార్‌లో నటుడి గురించి చెప్పాలంటే? 'స్వయంకృషి', 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు', 'అభిలాష', 'చంటబ్బాయ్', 'పున్నమినాగు' వంటి సినిమాలు గుర్తు చేయాలి. ప్రతినాయకుడిగా కనిపించిన 'న్యాయం కావాలి', 'తయారమ్మ బంగారయ్యా', '47 రోజులు', 'మోసగాడు' వంటి సినిమాలనూ ప్రస్తావించాలి.

కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి విలన్ పాత్రల్లో నటించారు. 'న్యాయం కావాలి'లో ఓ అమ్మాయిని ప్రేమించి, తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకునే పాత్రలో కనిపించారు. ప్రేమికుడిగా, మోసగాడిగా నటనలో వైవిధ్యం చూపించారు. 'మోసగాడు'లో శ్రీదేవిని పాడుచేసే సీన్ చేశారు. '47 రోజులు'లో జయప్రదపై శాడిజం చూపించే సన్నివేశాల్లో చిరు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

'కోతల రాయుడు'తో సోలో కథానాయకుడిగా చిరంజీవి మారినా... ఆ తర్వాత చేసిన 'పున్నమినాగు'లో చిరంజీవి నట విశ్వరూపం చూపించారు. ఇప్పటికీ నటుడిగా చిరంజీవిలో ఎవరెస్టు అంత ప్రతిభ గురించి చెప్పాలంటే... నాగులు పాత్ర ప్రస్తావన తప్పనిసరి. పాములా మారే సన్నివేశాల్లో నటన అద్భుతం. ఒంటి మీద చర్మం లాగే సన్నివేశాల్లో (పాములు కుబుసం విడిచినట్లు చేసే సీన్స్), ఆత్మహత్య చేసుకునేటప్పుడు... మెగాస్టార్ హావభావాలు కంటతడి పెట్టిస్తాయి.

అభిమానుల గుండెల్లో 'ఖైదీ'
కథానాయకుడిగా ఒక ఇమేజ్ వచ్చాక, ముఖ్యంగా 'ఖైదీ' తర్వాత చిరంజీవి మాస్, కమర్షియల్ సినిమాలే ఎక్కువ ఎంపిక చేసుకున్నారు. అలాగని... చిరు ప్రయోగాలు చేయలేదని కాదు, చేశారు. కానీ, కమర్షియల్ సినిమాల మధ్య ప్రయోగాత్మక చిత్రాల సంఖ్య తక్కువ. 
'ఖైదీ' విడుదలైన ఏడాది, ఆ సినిమా కంటే ఆరేడు నెలల ముందు ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అభిలాష' నటుడిగా చిరంజీవిలో ప్రతిభకు మరో నిలువుటద్దం! ఉరిశిక్ష పడ్డ ఖైదీగా, తన కేసును తానే వాదించుకునే లాయర్ పాత్రలో మెగాస్టార్ జీవించారు. చిరంజీవి చేసిన తొలి ప్రయోగాత్మక సినిమా ఏదంటే? బహుశా... 'అభిలాష' అని చెప్పాలేమో!?

'ఖైదీ' తర్వాత చిరంజీవి చేసిన ప్రయోగాత్మక చిత్రం 'స్వయంకృషి'. అందులో మనకు మెగాస్టార్ కనిపించరు. అప్పటికి తనకు స్టార్ ఇమేజ్ వచ్చినా... దాన్ని పక్కన పెట్టి మరీ చిరంజీవి ఆ సినిమా చేశారు. అందులో చెప్పులు కుట్టే సన్నివేశం నటుడిగా చిరు నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తుంది. రోడ్డు పక్కన ఎవరైనా చెప్పులు కుట్టే శ్రామికులను చూడండి. మెగా పర్ఫెక్షన్ తెలుస్తుంది. అప్పట్లో ఆయన ఆ పాత్ర చేయడం ఒక సంచలనం. ఇక, 'రుద్రవీణ'లో అయితే కేవలం కళ్ళతో నటించారు చిరంజీవి. నటుడిగా పేరు తెచ్చినా... జాతీయ పురస్కారాలు వచ్చినా... నిర్మాతగా చిరంజీవి తమ్ముడు నాగబాబుకు నష్టం కలిగించింది.

జడివానలు కురిసినా, తుఫాను తీవ్రత ఉన్నా... చిరంజీవి కమర్షియల్ సినిమాలు విడుదలైతే వసూళ్ళ వరద పారింది. బాక్సాఫీస్‌ను కలెక్షన్ల సునామీలు వరుసపెట్టి  ముంచెత్తాయి. ఆ స్థాయిలో చిరంజీవి చేసిన ప్రయోగాత్మక చిత్రాలకు వసూళ్లు రాలేదు. సరి కదా... నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. నటుడిగా సంతృప్తి కంటే నిర్మాత మేలు కోసం, అభిమానులను అలరించడం కోసం చిరంజీవి సినిమాలు చేశారు. తన చుట్టూ కమర్షియల్ పరిధి గీసుకున్నారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పరిమితుల మధ్య సినిమాలు చేశారు.

జాతీయ అవార్డు ఎక్కడ?
చిరంజీవి ఖాతాలో నంది పురస్కారాలు ఉన్నాయి. ఫిలింఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆయన్ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అయితే... ఆయన ఖాతాలో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం లేదు.'రజనీకాంత్ + కమల్ హాసన్ = చిరంజీవి' అని 'రుద్రవీణ' సమయంలో దర్శక దిగ్గజం కె. బాలచందర్ చెప్పారు. ఆ సినిమా ఫలితమో? మరొకటో? కమల్ తరహాలో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల కంటే కమర్షియల్ విజయాలు సాధించే కథలకు చిరంజీవి ఎక్కువ ఓటేశారు. అందువల్ల ఏమో? ఉత్తమ నటుడిగా కమల్ హాసన్ మూడు జాతీయ పురస్కారాలు అందుకుంటే... రజనీకాంత్‌లా చిరు ఒక్కటి కూడా అందుకోలేదు. మెగాభిమానులు కొందరు అదొక లోటుగా భావిస్తారు. 'రుద్రవీణ'కు జాతీయ పురస్కారాల కమిటీ నుంచి చిరంజీవికి జ్యూరీ విభాగంలో అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడిగా రాలేదు (No National Award For Chiranjeevi).

Also Read : ఎవరూ టచ్ చేయలేరు - ఎప్పటికీ ఈ రికార్డ్స్ మెగాస్టార్‌వే

అభిమానుల కోసం నటుడిగా మెగాస్టార్ చిరంజీవి చేసిన త్యాగం ఆయన్ను జాతీయ అవార్డులకు దూరం చేసిందా? అంటే... 'ఏమో?' చెప్పలేం! ఆయన అద్భుత అభినయం కనబరిచిన కొన్ని సినిమాలకు జాతీయ స్థాయి గుర్తింపు విషయంలో అన్యాయం జరిగిందనే అభిప్రాయం మెగాభిమానుల్లో ఉంది. ఒక్కటి మాత్రం నిజం... అవార్డులను మించిన అభిమానుల్ని చిరంజీవి సొంతం చేసుకున్నారు. సేవా కార్యక్రమాల్లో వాళ్ళను భాగస్వాముల్ని చేశారు. నేత్రదానం, రక్తదానం చేయిస్తూ... కథానాయకుడిగా కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలిచి ఇండస్ట్రీ పెద్దదిక్కు అయ్యారు. 

ఇప్పుడు అవార్డులతో, విజయాలతో వెల కట్టలేనంత ఎత్తుకు చిరంజీవి ఎదిగారన్నది సత్యం! ఆయనొక లెజెండ్. చిరంజీవి ఒక వ్యక్తి కాదు, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన శక్తి. 

Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

Published at : 22 Aug 2022 08:17 AM (IST) Tags: chiranjeevi Chiranjeevi Birthday Why No National Award For Chiranjeevi Chiranjeevi Filmography Analysis Chiranjeevi Awards Why Megastar Away From Performance Roles

సంబంధిత కథనాలు

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Godfather: పూరీ చస్తే చేయనన్నాడు, గజగజా వణికిపోయాడు: చిరంజీవి

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Mahesh Babu: మహేష్ కారణంగా నిర్మాతకు కోట్లలో నష్టాలు - నిజమేనా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Balakrishna: బాలయ్యతో సమంత చిట్ చాట్ - వర్కవుట్ అవుతుందా?

Tamannaah Bhatia: సింగిల్‌గా కాదు, ఏడాది పాటు పార్టనర్‌తో ఉంటా - ‘డేటింగ్’పై తమన్నా వ్యాఖ్యలు

Tamannaah Bhatia: సింగిల్‌గా కాదు, ఏడాది పాటు పార్టనర్‌తో ఉంటా - ‘డేటింగ్’పై తమన్నా వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - అక్కడ మోత మోగిస్తుందిగా!

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల