News
News
X

Orphan First Kill Trailer: ‘ఆర్ఫన్: ఫస్ట్ కిల్’ ట్రైలర్ - ఆ కోరికలతో రగిలిపోయే క్రూరమైన అనాథ పిల్ల

ఆ అనాథ పిల్లను దత్తత తీసుకున్న ఆ కుటుంబ పరిస్థితి ఏమైంది? ఆ తర్వాత ఎలాంటి దారుణాలు జరిగాయి?

FOLLOW US: 

మీరు Orphan మూవీ చూశారా? పిల్లల పుట్టకపోవడంతో ఓ జంట అనాథ బాలికను పెంచుకోవాలని అనుకుంటారు. ఈ సందర్భంగా ఓ బాలిక చాలా బాగా నచ్చేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఊహించని ఘోరాలు చోటుచేసుకుంటాయి. వాస్తవానికి ఆమె బాలిక కాదు.. 33 ఏళ్ల మహిళ. హైపోపిట్యూటరిజం సమస్య వల్ల ఆమె ఎదుగుదల ఆగిపోతుంది. దీంతో ఆమె చిన్న పిల్లలాగే మిగిలిపోతుంది. దీంతో ఆమెలో లైంగిక కోరికలు పెరుగుతాయి. దత్తత తీసుకున్న జంట సెక్సులో పాల్గోవడాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోతుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి ఘోరాలకు పాల్పడుతుందనేది కదా. ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ ‘Orphan: First Kill’ సిద్ధమైపోయింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజైంది. 

ఈ ప్రిక్వెల్ ట్రైలర్ చూసే ముందు మీరు తప్పకుండా తొలి భాగంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. కేట్, జాన్ కోల్‌మన్‌లకు పెళ్లి తర్వాత మూడో బిడ్డ జెస్సికా చనిపోతుంది. దీంతో జాన్ స్థానిక అనాథాశ్రమం సెయింట్ మరియానాస్ హోమ్ ఫర్ గర్ల్స్ నుంచి 9 ఏళ్ల రష్యన్ అమ్మాయి ఎస్తేర్‌ను దత్తత తీసుకుంటారు. అప్పటికే కేట్ జాన్‌లకు 5 ఏళ్ల చెవిటి కుమార్తె మాక్స్, 12 ఏళ్ల కుమారుడు డేనియల్ ఉంటారు.

ఎస్తేర్ ఆ ఇంట్లో ఘోరమైన పనులకు పాల్పడుతుంటుంది. గాయపడిన పావురాలను చంపడం, క్లాస్‌మేట్‌ను తీవ్రంగా గాయపరచడం వంటివి చేస్తుంది. చివరికి మాక్స్, డేనియల్‌లను సైతం శత్రువుల్లా చూస్తుంది. చిన్న వయస్సులోనే ఆమె సెక్స్ గురించి మాట్లాడటం విని తల్లి కేట్ షాకవ్వుతుంది. ఎస్తేర్ ప్రవర్తనపై అనుమానం కలుగుతుంది. దీంతో కేట్ అనాథాశ్రమానికి వెళ్లి ఆమె గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆమె ఎక్కడుంటే అక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయని, జాగ్రత్తగా ఉండాలని ఆశ్రమం నిర్వాహకురాలు హెచ్చరిస్తుంది. తన గురించి అన్ని నిజాలు తెలిసిన అబిగైల్ కారుకు అడ్డుగా వెళ్ళి ప్రమాదానికి కారణమవుతుంది. ఆ తర్వాత ఆమెను సుత్తితో కొట్టి చంపేస్తుంది. ఆమె శవాన్ని దాచేందుకు మ్యాక్స్ సాయం తీసుకుంటుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని మ్యాక్స్‌ను బెదిరిస్తుంది. 

ఎస్తేర్ గురించి తెలుసుకున్న కేట్ తన జాన్‌ను అప్రమత్తం చేస్తుంది. కానీ, జాన్ ఆమె మాటలను నమ్మడు. ఎస్తేర్‌కు ఈ విషయం తెలిసి కేట్‌ను బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. తన చేతిని తానే విరుచుకుని కేట్ అలా చేసిందని చెబుతంది. దీంతో జాన్, కేట్ మధ్య గొడవ జరుగుతుంది. కేట్ ఎస్తేర్ గురించి ఒక్కో నిజం తెలుసుకుంటుంది. ఆమె ఒక పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి అనాథశ్రమంలో తక్కువ వయస్సు చెప్పి జాయిన్ అయినట్లు తెలుసుకుంటుంది. మరోవైపు అబిగైల్‌ను హత్య చేసినది ఎస్తేర్ అని డేనియల్‌కు చెబుతుంది. ఆమె శవాన్ని ఉంచిన ట్రీహౌస్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇది తెలిసి ట్రీహౌస్‌కు నిప్పుపెట్టి డేనియల్‌ను చంపాలని అనుకుంటుంది. ఈ విషయం తెలిసి ఎస్తేర్‌ను కేట్ హెచ్చరిస్తుంది. చెంపదెబ్బ కొట్టి తన పిల్లలకు దూరంగా ఉండాలని అంటుంది.

అదే రోజు ఎస్తేర్.. తన పెద్ద అమ్మాయిలా మేకప్ వేసుకుని జాన్‌ను లైంగికంగా లోబరుచుకోవాలని చూస్తుంది. దీంతో కేట్ చెప్పింది నిజమేనని తెలుసుకున్న జాన్.. ఎస్తేర్‌ను తిరిగి అనాథాశ్రమానికి పంపిస్తానని హెచ్చరిస్తాడు. మరోవైపు కేట్ ఎస్తేర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటుంది. ఎస్టోనియాలో జన్మించిన లీనా క్లామెర్ అనే 33 ఏళ్ల మహిళ అని తెలుసుకుంటుంది. ఆమెకు హైపోపిట్యుటరిజం ఉంది. ఇది ఆమె శారీరక ఎదుగుదలను ఆపేసింది. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం చిన్నపిల్లగా నటిస్తూ గడిపింది. లీనా గతంలో ఆమెను దత్తత తీసుకున్న కుటుంబాన్ని కూడా చంపేసింది. దాదాపు ఏడుగురిని హత్య చేస్తుంది. ఈ కథను త్వరలో విడుదల కానున్న ప్రీక్వెల్ మూవీలో చూపించనున్నారు. అయితే, ఈ సినిమా విడుదలయ్యే లోపే మీరు ‘ఆర్ఫన్’ ఫస్ట్ పార్ట్‌లో చివరికి లీనా(ఎస్తేర్) ఏం చేస్తుందనేది చూడండి.

Also Read: 'ది వారియర్' రివ్యూ: డాక్టర్ పోలీస్ అయితే? రామ్ సినిమా ఎలా ఉందంటే?

Orphan: First Kill - Trailer

Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?

Published at : 14 Jul 2022 02:03 PM (IST) Tags: Orphan First Kill Trailer Orphan First Kill Orphan First Kill Movie Orphan Movie

సంబంధిత కథనాలు

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

టాప్ స్టోరీస్

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Zoonotic Langya Virus: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే

Zoonotic Langya Virus: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే