By: ABP Desam | Updated at : 07 Apr 2023 06:51 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Venu Yeldandi/Twitter
Balagam: సినీ నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ప్రియ దర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్ లుగా నటించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ ‘బలగం’ మూవీ పెద్ద హిట్ ను అందుకుంది. తెలంగాణ సాంప్రదాయాలను అద్దం పట్టే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె వాతావరణం, అక్కడి మనుషుల జీవనశైలి, ఆచార సాంప్రదాయాలు, మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలను చాలా చక్కగా చూపించారు దర్శకుడు వేణు. దీంతో ఈ సినిమా కోసం థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టారు. సినిమా ఓటీటీ లో రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాను థియేటర్లలో చూడటానికే ఇష్టపడుతున్నారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలే కాదు వరుస అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. బుల్లితెరపై కూడా సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు పలు అవార్డులు దక్కాయి. ఈ చిన్న సినిమా గ్లోబల్ స్థాయిలో ఏకంగా 6 అవార్డులను అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ‘బలగం’ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ వేణు ఉత్తమ ఉత్తమ దర్శకుడిగా ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డుకు అందుకున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను అందాయి. అలాగే ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలోనూ ‘బలగం’ అవార్డు దక్కించుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో నాలుగు అవార్డులు దక్కిన ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు రావడం విశేషం.
ఇక ‘బలగం’ సినిమాకు మొదటి రోజు నుంచే విశేషమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజైన ఈ సినిమా ఊహించని హిట్ ను అందుకుంది. ఆంధ్రా, తెలంగాణ అన్ని ఏరియాల్లో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. ఇప్పటికీ మూవీ థియేటర్ లో రన్ అవుతుంది. ఈ క్రమంలో సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ. 26.72 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.30 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది ‘బలగం’. ఇక ఈ మూవీలో నటీనటులు కూడా చాలా న్యాచురల్ గా చేశారు. కథ కొత్తగా ఉండటం, స్క్రీన్ ప్లే నటీనటుల నటన, నేపథ్య సంగీతం ఇలా అన్నీ ఈ సినిమాకు కలసి రావడంతో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు
We are honoured to announce that our very own @VenuYeldandi9 won the best director award for #Balagam #BalagamGoesGlobal @priyadarshi_i @kavyakalyanram @dopvenu #Bheemsceciroleo @LyricsShyam@DilRajuProdctns @HR_3555 #HanshithaReddy @adityamusic @vamsikaka @WallsAndTrends pic.twitter.com/fIy6wV1OA4
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) April 7, 2023
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్లో కాల్మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?
చాలా సింపుల్గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు