'భీమ్లా నాయక్' డేట్ మీద కన్నేసిన రాజ'శేఖర్'... సంక్రాంతి బరిలో మరో యాంగ్రీ స్టార్!
సంక్రాంతి సీజన్‌లో మరో సినిమా విడుదల కానుంది. బహుశా... రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడిస్తారేమో!?
ఒక్క వాయిదా... ఒకే ఒక్క సినిమా వాయిదాతో... సంక్రాంతి సీజన్‌లో సినిమా లెక్కలన్నీ మారిపోయాయి. ఓ భారీ పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్' వెనక్కి వెళ్లడంతో... సంక్రాంతి బరిలోకి దూకడానికి అరడజను తెలుగు సినిమాలు రెడీ అయ్యాయి. లేటెస్టుగా మరో సినిమా ఈ లిస్టులో చేరిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారని సమాచారం. యంగ్ హీరోల కంటే ఓ రెండు మూడు రోజుల ముందే ఆయన థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ మీద ఆయన కన్నేసినట్టు ఫిల్మ్ నగర్ ఖబర్. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా 'శేఖర్'. పాన్ ఇండియా సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాన్ 'భీమ్లా నాయక్' సినిమాలు సంక్రాంతి సీజన్‌లో ఉన్నప్పుడు... 'శేఖర్' సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అయితే సంక్రాంతికి... లేదంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26కి విడుదల చేద్దామని సినిమాను రెడీ చేశారు.
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' వాయిదా పడటంతో సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన రావచ్చు. తొలుత 'భీమ్లా నాయక్'ను జనవరి 12న విడుదల చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఆ డేట్ మీద రాజ'శేఖర్' కన్నేశారు. జనవరి 14న 'రాధే శ్యామ్' విడుదలకు రెడీ అయ్యింది. అదే రోజున 'డీజే టిల్లు', 'సూపర్ మచ్చి' ఉన్నాయి. జనవరి 15న మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయం అవుతున్న 'హీరో' ఉంది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్', 'దిల్' రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న 'రౌడీ బాయ్స్' సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాయి. అందుకని, జనవరి 12న శేఖర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారట.
'శేఖర్' కోసం రాజశేఖర్ తన లుక్ మార్చారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లోకి వచ్చారు. హీరోగా ఆయన 91వ సినిమా ఇది. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన 'శేఖర్'లో 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్ హీరోయిన్. ఎంఎల్‌వి సత్యనారాయణ, శ్రీనివాస్ బొగ్గరం, రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..
Also Read:'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?
Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..
Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..
Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..
Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి