'ఆచార్య' రిలీజ్ డేట్ మీద కన్నేసిన రాజ'శేఖర్'...
రాజ'శేఖర్' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఆయన పుట్టినరోజుకు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పుడు విడుదల తేదీలను దర్శక నిర్మాతలో... లేదంటే హీరోలో నిర్ణయించడం లేదు. కరోనా నిర్ణయిస్తోంది. కరోనా వ్యాప్తి మన నియంత్రణలో ఉంటే సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. లేదంటే... వెనక్కి వెళుతున్నాయి. కరోనా కారణంగా 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' వాయిదా పడ్డాయి. 'భీమ్లా నాయక్' ఎలాగో రావడం లేదు. అందుకని, ఈ గ్యాప్‌లో రావాలని 'శేఖర్' టీమ్ అనుకుంది. అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. కానీ, ప్రమోషన్ స్టార్ట్ చేసింది. రాజశేఖర్ ఫ్యామిలీ టీవీ కార్యక్రమాలకు కూడా వెళ్లారు. అయితే... పరిస్థితుల కారణంగా సినిమా రావడం లేదు. ఇప్పుడు ఫిబ్రవరి 4న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు. అన్నీ కుదిరితే... ఆయన బర్త్ డే సందర్భంగా ఆ రోజున 'శేఖర్' సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు రాజశేఖర్ సతీమణి, 'శేఖర్' దర్శకురాలు జీవిత పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే... ఫిబ్రవరి 4న 'ఆచార్య' సినిమా విడుదల చేయాలని మెగాస్టార్ చిరంజీవి టీమ్ భావించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదలను నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో 'శేఖర్' సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఆల్రెడీ సినిమా రెడీగా ఉండటంతో కరోనా తగ్గుముఖం పడితే... ఫిబ్రవరి 4న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Also Read: చచ్చిపోతా, మంట పెట్టేస్తారనుకున్నా - రాజశేఖర్ భావోద్వేగం... జీవిత కన్నీరు
'శేషు', 'ఎవడైతే నాకేంటి?', 'మహంకాళి', 'సత్యమేవ జయతే' సినిమాల తర్వాత రాజశేఖర్ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రమిది. వారంలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకోగా... కొవిడ్ సోకి రాజశేఖర్ ఆస్పత్రిలో చేరడంతో, ఆయన కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత తానే దర్శకత్వం వహించానని జీవిత చెప్పారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించారు. సినిమాలో 50 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తారని జీవిత తెలిపారు. ఈ సినిమాలో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ కూడా నటించారు.
Also Read: సినిమాలోనూ తండ్రీ కూతుళ్లుగా... అందరూ వద్దన్నా సరే!
Also Read: సిద్ధార్థ్‌తో మాట్లాడలేదు! కానీ, అతను క్షమాపణలు కోరడం సంతోషమే! - సైనా నెహ్వాల్
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..
Also Read: విడాకుల తర్వాత మాంచి జోష్‌లో చైతూ.. పెళ్లి వద్దంటూ పాట!
Also Read: అప్పుడు వదినగా... ఇప్పుడు స్పెషల్ సాంగ్ భామగా!
Also Read: రిపోర్టులో 'నెగెటివ్'... ఫుల్ హ్యాపీగా త్రిష!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి