Tamannaah Special Song: అప్పుడు వదినగా... ఇప్పుడు స్పెషల్ సాంగ్ భామగా!
తమన్నా మరో స్పెషల్ సాంగ్‌తో సందడి చేయనున్నారు. అయితే... ఈసారి స్పెషల్ సాంగ్‌లో హీరోతో సినిమా పరంగా ఆమెకు ఓ స్పెషల్ బాండ్ ఉంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్నారు. ఆమె డాన్స్ చేసిన ఆ సాంగ్ 'కొడితే...' (Kodthe Song - Ghani Movie)ను సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తమన్నా స్టిల్ విడుదల చేశారు.
తమన్నాకు స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్త ఏమీ కాదు. గతంలో ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో 'స్వింగ్ జరా...', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో 'డాంగ్ డాంగ్', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు శీను'లో 'లబ్బర్ బొమ్మ', 'స్పీడున్నోడు'లో 'బ్యాచిలర్ బాబు', 'జాగ్వార్' సినిమాలో 'మందార తైలం' తదితర సాంగ్స్ చేశారు. ఇప్పుడు 'గని'లో 'కొడితే...' చేస్తున్నారు. అయితే... ఈ స్పెషల్ సాంగ్‌లో హీరో వరుణ్ తేజ్, తమన్నా మధ్య సినిమా పరంగా ఆమెకు స్పెషల్ బాండ్ ఉంది.
వరుణ్ తేజ్‌తో గతంలో తమన్నా ఓ సినిమా చేస్తున్నారు. అది 'ఎఫ్ 2'. అందులో అతడికి వదినగా నటించారు. 'ఎఫ్ 3'లోనూ ఇద్దరూ నటిస్తున్నారు. వెంకటేష్ జోడీగా తమన్నా కనిపిస్తారు కాబట్టి... మళ్లీ వరుణ్‌కు వదినగా కనిపిస్తారేమో! 'గని'లో మాత్రం ఇద్దరూ జంటగా స్టెప్స్ వేయనున్నారు.
View this post on Instagram
కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఈ ఏడాది మార్చి 18న సినిమా విడుదల కానుంది.
Also Read: రిపోర్టులో 'నెగెటివ్'... ఫుల్ హ్యాపీగా త్రిష!
Also Read: ఫూల్స్ డే రోజు మహేష్ రాడట.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!
Also Read: అమ్మో! అజయ్‌కు రోజుకు ఐదు కోట్లు.... ఆలియాకు నిమిషానికి 50 లక్షలా?
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: నెలసరి నొప్పిపై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి