అన్వేషించండి
Advertisement
Trisha Covid: రిపోర్టులో 'నెగెటివ్'... ఫుల్ హ్యాపీగా త్రిష!
త్రిష ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? రిపోర్టులో నెగెటివ్ వచ్చినందుకు! అదీ కొవిడ్ రిపోర్టులో! కొవిడ్ నెగెటివ్ అంటే సంతోషమే కదా!
బీ పాజిటివ్ అంటారు పెద్దలు! కానీ, ఇప్పుడు అందరూ కోరుకునేది ఒక్కటే... బీ నెగెటివ్! కరోనా రిపోర్టులో 'నెగెటివ్' రిజల్ట్ కోరుకుంటున్నారు. తనకు నెగెటివ్ అని రావడంతో స్టార్ హీరోయిన్ త్రిష ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆమె అభిమానులకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి.
కొన్ని రోజుల క్రితం తాను కరోనా బారిన పడినట్టు త్రిష సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. "ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా సరే... న్యూ ఇయర్ కంటే కొంచెం ముందు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాకు కరోనా లక్షణాలు అన్నీ ఉన్నాయి. రోజులు భారంగా, బాధగా గడిచినా... కోలుకుంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన బావున్నాను. అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. అలాగే, తప్పనిసరిగా మాస్క్ ధరించండి" అని త్రిష తెలిపారు. బుధవారం ఉదయం కరోనా నుంచి కోలుకున్నట్టు ఆమె తెలిపారు.
"రిపోర్టులో నెగెటివ్ అనే పదం చదివినందుకు ఇంతకంటే సంతోషంగా ఎప్పుడూ లేను. మీరు చూపించిన ప్రేమ, నేను త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్థనలకు థాంక్యూ" అని త్రిష పేర్కొన్నారు. సంగీత దర్శకుడు తమన్, హీరో విశ్వక్ సేన్ కూడా కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా తగ్గిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. తనకు కరోనా అని కీర్తీ సురేష్ మంగళవారం ప్రకటించారు.
View this post on Instagram
Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!
Also Read: అమ్మో! అజయ్‌కు రోజుకు ఐదు కోట్లు.... ఆలియాకు నిమిషానికి 50 లక్షలా?
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: నెలసరి నొప్పిపై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: అమ్మో! అజయ్‌కు రోజుకు ఐదు కోట్లు.... ఆలియాకు నిమిషానికి 50 లక్షలా?
Also Read: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
Also Read: నెలసరి నొప్పిపై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion