Sushanth as Ram: రాక్షసుల రాజ్యంలో రాముడిగా అక్కినేని మనవడు
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'రావణాసుర' సినిమాలో రాముడిగా అక్కినేని మేనల్లుడు సుశాంత్ నటిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ రూపొందిస్తున్న సినిమా 'రావణాసుర'. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్‌టి టీమ్ వర్క్స్ బ్యానర్ రవితేజదే. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా మారుతున్నారు. ఇందులో అక్కినేని మనవడు సుశాంత్ కూడా నటిస్తున్నారు. 'అల... వైకుంఠపురములో' సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రలో నటించారు. అలాగే, హీరోగానూ ఆయన సినిమాలు చేస్తున్నారు. 'అల...' తర్వాత ఆయన ఇంపార్టెంట్ రోల్ చేయడానికి అంగీకరించిన సినిమా 'రావణాసుర'.
రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉండాలి కదా! 'రావణాసుర'గా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. ఈ రోజు ఆయన నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే, సుశాంత్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. "రాక్షసుల రాజ్యం నుంచి... రాముడిగా సుశాంత్‌ను పరిచయం చేస్తున్నాం. అలాగే, ఆయన మా మాస్ మహారాజా రవితేజ 'రావణాసుర' చిత్రంలోకి ఆహ్వానిస్తున్నాం" అని చిత్రబృందం పేర్కొంది.
From the World of DEMONS 👺
— sudheer varma (@sudheerkvarma) January 11, 2022
Introducing & Welcoming @iamSushanthA On Board as #RAM🤘🏻
In
massmaharaja Raviteja ‘s #RAVANASURA🔥
Here’s #RAMFirstLook 😎#𝗥𝗔𝗩𝗔𝗡𝗔𝗦𝗨𝗥𝗔 🔥@RaviTeja_offl @sudheerkvarma @AbhishekPicture @RTTeamWorks @SrikanthVissa pic.twitter.com/T55lPJ3lfS
'రావణాసుర' సినిమాలో రవితేజ పది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించిన ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాత.
Into the World of DEMONS! 👺
— Sushanth A (@iamSushanthA) January 11, 2022
Thank you for this sizzling welcome as #RAM in #RAVANASURA 🔥
Mass Maharaja @RaviTeja_offl Sir,@sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks
🎉🤗
Hope you guys like #RAMFirstLook ! pic.twitter.com/jDu6IAoOLw
Also Read: ఈసారి మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి? అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథలో...
Also Read: సోదరి రాజకీయాలకు, నా సేవకు సంబంధం లేదు... దేని దారి దానిదే! - సోనూ సూద్
Also Read: సిద్ధార్థ్ దేశానికి ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టుకున్న సైనా నెహ్వాల్ తండ్రి
Also Read: పీరియడ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్
Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్...
Also Read: పవన్ కల్యాణ్‌తో వన్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి