Krithi Shetty: ఈసారి మెగా డాటర్ సినిమాలో కృతి శెట్టి? అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథలో...

మొదటిసినిమాతోనే అభిమానులను సంపాదించుకున్న నటి కృతి శెట్టి. ఆమె కెరీర్ జోరు మీద సాగుతోంది.

FOLLOW US: 

కృతి శెట్టి మొదటి సినిమా ‘ఉప్పెన’. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా. అందులో ఇద్దరూ నటనలో అదరగొట్టి మంచి పేరుతో పాటూ, సినిమా అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఇక కృతి శెట్టి అయితే చేతినిండా సినిమాలతో రెండు మూడేళ్లు బిజీగా ఉంది. తాజాగా ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. త్వరలో ‘బంగార్రాజు’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది కృతి. వీరిద్దరి జోడీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఆ సినిమాకు కరోనా దెబ్బ పడేలా కనిపిస్తోంది. 

మెగా డాటర్‌కు నచ్చేసి...
చిరంజీవి కూతురు సుస్మిత తన తండ్రి సినిమాల్లో కొన్నింటికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె నిర్మాతగా మారింది. ఆహాలో విడుదలైన ‘సేనాపతి’ సినిమాకు నిర్మాతగా పనిచేసింది. ఇందులో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అందరి మన్ననలు పొందింది. దీంతో తనపై తనకు మరింత నమ్మకం పెరిగింది సుస్మితకు. దీంతో నిర్మాతగా రెండో సినిమాను ప్లాన్ చేస్తోంది. ఆ సినిమాలో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెలుస్తోంది. ఇందులో కీలకపాత్ర కోసం కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఇదే నిజమైతే అతి తక్కువ సమయంలోనే కృతి మంచి సినిమాను దక్కించుకున్నట్టే. అరుంధతి సినిమా తరువాత హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది అనుష్కనే. ఇప్పుడు కృతి అలాంటి సినిమాలో నటించాక, ఆ సినిమా హిట్ కొడితే కృతి మరో అనుష్క కావడం ఖాయం. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం విరించి వర్మకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇతను ‘ఉయ్యాల జంపాల’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  సుస్మితకు కృతి అందం, అభినయం తెగ నచ్చేశాయట. అందుకే ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ లో కృతికి మంచి పేరుంది. 

Also Read: ఆమె ఆవేదన అక్షర రూపంలో... అయిదేళ్ల మౌనం తరువాత తొలిసారి స్పందించిన భావన
Also Read: పీరియ‌డ్స్‌పై ఇలియానా షాకింగ్ కామెంట్స్‌
Also Read: పవన్ కల్యాణ్ 'హరి హర వీర మల్లు' లేటెస్ట్ అప్‌డేట్‌...
Also Read: పవన్ కల్యాణ్‌తో వ‌న్స్‌మోర్ ప్లీజ్... - నిధి అగర్వాల్ ఇంటర్వ్యూ
Also Read: రేణుదేశాయ్, అకీరా నందన్ కు కోవిడ్ పాజిటివ్..

Also Read: ఐసీయూలో లతా మంగేష్కర్... కరోనాతో ఆస్పత్రిలో చేరిక
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 04:18 PM (IST) Tags: Sushmita Konidela కృతి శెట్టి Kriti Shetty women Oriented Movies

సంబంధిత కథనాలు

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!

Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!

Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?

Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు

Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర

AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర

Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు, వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!

Guntur News : బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న గుజరాత్ కిలేడీలు,  వాహనాల తాళాలు లాక్కొని బ్లాక్ మెయిల్!

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు