Sharwanand: 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ సింగిల్.. ఎమోషనల్ గా సాగే 'అమ్మ' పాట..
'ఒకే ఒక జీవితం' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు.
![Sharwanand: 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ సింగిల్.. ఎమోషనల్ గా సాగే 'అమ్మ' పాట.. Oke Oka Jeevitham: Amma Song Released from Oke Oka Jeevitham Sharwanand: 'ఒకే ఒక జీవితం' ఫస్ట్ సింగిల్.. ఎమోషనల్ గా సాగే 'అమ్మ' పాట..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/26/39e19aaa6f88ca82efe2d9b5a95c899e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో 'అమ్మ' సాంగ్ ను విడుదల చేశారు.
ఇందులో శర్వానంద్ తల్లిగా అమలా అక్కినేని నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య సాగే ఓ ఎమోషనల్ పాటను విడుదల చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఈ పాటను ట్విట్టర్ లో షేర్ చేశారు. దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.
జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
So happy to realease the song Amma from #OkeOkaJeevitham. Absolutely heart touching. This is golden. I dedicate this song to my dear mother. All the best to the whole team.https://t.co/uuVe4sfPY8@amalaakkineni1 @ImSharwanand
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 26, 2022
View this post on Instagram
Also Read: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?
Also Read: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)