By: ABP Desam | Updated at : 10 Jul 2022 07:32 PM (IST)
ఎన్టీఆర్ 30పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను వదిలారు. అదొక రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
నిజానికి ఈపాటికే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ ఆలస్యమవుతుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటున్నారు కానీ దానిపై కూడా స్పష్టత లేదు. దర్శకుడు కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేయడంలో విపరీతంగా జాప్యం చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 'ఆచార్య' సినిమా కనీసం ఏవరేజ్ గా ఆడినా.. కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ ను వేగంగా మొదలుపెట్టేవారు. కానీ చిరు కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ అవ్వడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎంతో నమ్మకస్తులైన తన టీమ్ లో కొందరు సభ్యులు స్క్రిప్ట్ దశలో జరుగుతున్న తప్పిదాల గురించి తెలుసుకోలేకపోవడం శివని డిస్టర్బ్ చేసిందట. అందుకే ఎలాంటి మొహమాటం లేకుండా వాళ్లలో కొందరిని మార్చేసి కొత్తవాళ్లను తీసుకునే క్రమంలో ఇంత ఆలస్యం జరుగుతోందని టాక్. ఇవన్నీ ఒకటైతే.. ఇప్పటివరకు హీరోయిన్ ను లాక్ చేయకపోవడం మరో తలనొప్పి.
ముందుగా అలియాభట్ ను అనుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాల వలన నో చెప్పింది. అప్పటినుంచి హీరోయిన్స్ కోసం చాలా ఆప్షన్స్ చూస్తున్నారు కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన హీరోయిన్స్ ను మళ్లీ రిపీట్ చేయడం కొరటాలకు ఇష్టం లేదు. టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు.
Also Read: సూర్యతో దుల్కర్ సల్మాన్ - మరో క్రేజీ ప్రాజెక్ట్ తో 'కేజీఎఫ్' నిర్మాతలు!
Also Read: 'హ్యాపీ బర్త్ డే'తో మత్తు వదిలిపోయింది!
Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!
Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం
Dobaaraa: తాప్సీ సినిమాకి షాక్ - ఆడియన్స్ లేక షోస్ క్యాన్సిల్!
Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్