అన్వేషించండి
Advertisement
NTR: ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్ - ఎక్కడికి వెళ్లారంటే?
సమ్మర్ వెకేషన్ భాగంగా ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా ఏళ్లుగా 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయ్యారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. NTR 30, NTR 31 సినిమాలను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలను పట్టాలెక్కించడానికి ముందుగానే తన ఫ్యామిలీని తీసుకొని ట్రిప్ కి చెక్కేశారు ఎన్టీఆర్. తన భార్య, ఇద్దరు పిల్లలు అలానే కొందరు స్నేహితులతో కలిసి సింగపూర్ కి వెళ్లారు.
ఒక్కసారి తన సినిమాలను మొదలుపెడితే మళ్లీ బ్రేక్ దొరకదు. అందుకే సమ్మర్ వెకేషన్ భాగంగా ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సింగపూర్ లో ఎన్టీఆర్ ని చూసిన కొందరు ఫ్యాన్స్ ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానుల సంఖ్య పెరిగింది. తమ అభిమాన హీరోని ఫారెన్ లో చూసిన ఫ్యాన్స్ అతడి ఫొటోలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ ఈ ట్రిప్ ని ముగించుకొని హైదరాబాద్ రానున్నారు. రాగానే కొరటాల శివ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు ఎన్టీఆర్. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
Our @tarak9999 anna recent snaps from Singapore 🤩🤩#ManOfMassesNTR pic.twitter.com/dxRxEffG8Q
— UK NTR Fans (@UKNTRfans) May 30, 2022
Tarak anna and Abhay ram at RGIA while traveling to singapore !! @tarak9999 🤗🐯❤️🤗💥#jaintr #NTR #NTR𓃵 #NTR30 #NTR31 #ManOfMassesNTR #jaintr pic.twitter.com/SUdplc9H9n
— NTR30 (@BRC_999) May 31, 2022
Hero at Singapore !! 😃#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/Q0cLv5YvXl
— Jr NTR Music (@TheNTRMusic) May 31, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
క్రికెట్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion