Nikhil Siddhartha: తండ్రి కాబోతున్న నిఖిల్? ఇదీ అసలు విషయం!
Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ గురించి గత కొద్ది రోజులు ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఆయన తండ్రి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ వార్తలో వాస్తవం ఎంత?
Hero Nikhil Siddhartha: గత కొంతకాలంగా వరుస సినిమాతో అద్భుత విజయాలు అందుకుంటున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా రేంజి హీరోగా మారిపోయిన ఆయన మరో గుడ్ న్యూస్ అందుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఆయన తండ్రి అవుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
పల్లవి వర్మతో ప్రేమ వివాహం
నిఖిల్ ప్రేమించిన అమ్మాయిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఏపీకి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ కొంత కాలం పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో ఏడడుగులు నడిచారు. కరోనా సమయంలో వీరి పెళ్లి సింపుల్ గా జరిగింది. కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహంలో పాల్గొన్నారు. పెళ్లి తర్వాత వీరి వ్యక్తిగత విషయాలకు సంబంధించి చాలా వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు కూడా రాశాయి కొన్ని వెబ్ సైట్లు. అయితే, ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని తేలిపోయాయి.
తండ్రి కాబోతున్న నిఖిల్ సిద్దార్థ్
తాజాగా వీరి గురించి మరో వార్త వైరల్ అవుతోంది. త్వరలో నిఖిల్ దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పల్లవి ప్రెగ్నెంట్ అయినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే, ఈ వార్తల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఆయన కానీ, ఆయన మిత్రులు కానీ, ఈ విషయం గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు.
‘కార్తికేయ 2‘తో ఫుల్ ఫామ్ లోకి నిఖిల్
ఇక 'హ్యాపీడేస్' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు హీరో నిఖిల్. అంతకు ముందు ‘హైదరాబాద్ నవాబ్స్‘ లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. నటుడిగా ఆయనకు మంచి బూస్టింగ్ ఇచ్చిన చిత్రం ‘హ్యాపీడేస్‘. ‘కార్తికేయ 2‘తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తను నటించిన సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి తాజాగా 'స్వయంభూ' అనే మరో పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తను వారియర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని తన పాత్ర కోసం కొద్ది నెలల పాటు యుద్థ విద్యలను నేర్చుకున్నట్లు తెలుస్తోంది. ‘స్వయంభూ’ సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. వాసుదేవ్ మునెప్ప డైలాగ్స్ అందిస్తున్నారు.
Read Also: నమ్మినవాళ్లే మోసం చేశారు, బాధను నవ్వుగా మార్చుకున్నా- సునీత