అన్వేషించండి

Singer Sunitha: నమ్మినవాళ్లే మోసం చేశారు, బాధను నవ్వుగా మార్చుకున్నా- సునీత

Singer Sunitha: గాయని సునీత జీవితంలో పడిన కష్టాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. నమ్మిన వాళ్లే మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Singer Sunitha On Her Career And Struggles: గాయనిగా రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా పరిశ్రమలో రాణిస్తున్నారు సునీత. తన అద్భుత గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడారు. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారు. అయితే, తన నవ్వు వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయన్నారు సునీత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ లో ఎదుర్కొన్న ఉత్థాన పతనాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకున్న సింగర్ సునీత 

చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను తన భుజాల మీదకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు సునీత. వ్యక్తిగతంగా, పర్సనల్ గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కెరీర్ ను మాత్రం వదులుకోలేదని చెప్పారు. “జీవితంలో కష్టనష్టాలు, సుఖ దు:ఖాలు కామన్. కానీ, వాటిని ఎలా తట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నా జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకుంటే కన్నీళ్లు పొంగుకొస్తాయి. చాలా విషయాల్లో నమ్మిన వారి నుంచే వంచనకు గురయ్యాను. నా మీద వచ్చిన విమర్శలు, సూటిపోటి మాటల గురించి ఎంత చెప్పినా తక్కువే” అన్నారు.

35 ఏళ్లు వచ్చే వరకు సమస్యలు ఎదుర్కొన్నా- సునీత

“చిన్న వయసులో అంటే సుమారు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా కెరీర్ మొదలు పెట్టాను. 19 ఏళ్లకే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కుటుంబానికి నేనే దిక్కుగా ఉన్నాను. 21 ఏళ్లకు తల్లిని అయ్యాను. 24 ఏళ్లకు ఇద్దరు పిల్లలు అయ్యారు. ఓవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరో వైపు సింగర్ గా కొనసాగాను. నాన్న చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. ఉన్న ఇళ్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. కష్టాలు ఎన్ని ఉన్నా కెరీర్ ను నిర్లక్ష్యం చేయలేదు. 35 ఏళ్లు వచ్చే వరకు కష్టాలు అనుభవించాను” అని వివరించారు.

నమ్మిన వాళ్లే మోసం చేశారు- సునీత

చాలా విషయాల్లో మోసపోయినట్లు సునీత చెప్పుకొచ్చారు. తన చుట్టూ ఉన్న వాళ్లే మోసం చేశారని చెప్పారు. “నా చుట్టూ ఉన్న వారే నన్ను చాలా సార్లు మోసం చేశారు. మోసపోయిన ప్రతిసారి బాధపడేదాన్ని. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నవ్వుతూనే ఉండేదన్నా. కొంత మంది నా నవ్వును కూడా హేళన చేసేవాళ్లు. నాదో ఫేక్ నవ్వు అంటూ విమర్శలు చేసే వాళ్లు. ఆ విమర్శలను  పట్టించుకునేదాన్ని కాదు. బాధను నవ్వు రూపంలో వ్యక్తం చేసేదాన్ని. నా జీవితం గురించి ఎంతో మంది ఎన్నో విధాలుగా కామెంట్ చేసే వాళ్లు. కానీ, నేను సమాధానం చెప్పేదాన్ని కాదు. నవ్వి వదిలేసేదాన్ని. కానీ, ఒక్కోసారి వారి మాటలు విని ఏడుపు వచ్చేది. ఏడ్చేదాన్ని. మళ్లీ మర్చిపోయేదాన్ని” అని చెప్పారు.

రెండో పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం- సునీత

జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాల్లో  రెండో పెళ్లి చేసుకోవడం మంచి నిర్ణయం అని చెప్పారు సునీత. ఇప్పుడు తన కుటుంబ చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. విమర్శలు, కష్టాలు ఎదురైనా గట్టిగా ఎదురు నిలబడటం వల్లే తన కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోందని చెప్పారు. ఎదుటి వారి మాటలకు బాధపడుతూ కూర్చుంటే జీవితం అక్కడే ఆగిపోయేదన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha)

Read Also: డ్రస్సు కారణంగా అనసూయ పాట్లు - కానీ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయకుండా - పుష్ప 2 అప్‌డేట్ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Lenin Box Office Collection Day 2: 'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
'లెనిన్' కలెక్షన్స్ పెరిగాయ్... రెండో రోజు బాక్సాఫీస్ దుమ్ము దులిపిన అఖిల్
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget