News
News
X

Karthikeya 2 Trailer: 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం' - 'కార్తికేయ 2' ట్రైలర్ 

నిఖిల్ నటిస్తోన్న 'కార్తికేయ 2' ట్రైలర్ ను విడుదల చేశారు. 

FOLLOW US: 

టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ తో ప్రేక్షకుల ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు. 

ఆగస్టు 13న ఈ సినిమా విడుదల కానుంది. నిజానికి జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఫైనల్ గా ఆగస్టు 13న డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రతీసారి తమ సినిమానే వాయిదా వేసుకోవడంపై నిఖిల్ కాస్త అసహనానికి లోనయ్యారు. కానీ ఇండస్ట్రీ మంచి కోసం కొన్ని చేయక తప్పదంటూ చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ఇదిలా ఉండగా.. కాసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

'ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. 'నా వరకు రానంత వరకే సమస్య నా వరకు వచ్చాక అది సమాధానం' అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ ద్వారా కథను రివీల్ చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. నిఖిల్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. 

ట్రైలర్ ఎలా ఉందో ఇక్కడ చూసేయండి.. 

'కార్తికేయ‌ 2'ను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల,  ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాల భైరవ. 

Also Read : ఆల్రెడీ 50 శాతం రికవరీ చేసిన కళ్యాణ్ రామ్ - 'బింబిసార' ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Also Read : హీరోలకు సంతోషాన్ని ఇచ్చిన 'బింబిసార', 'సీతా రామం'... కంగ్రాట్స్ చెబుతూ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ ట్వీట్స్

Published at : 06 Aug 2022 06:18 PM (IST) Tags: Karthikeya 2 chandu mondeti Karthikeya 2 Trailer Nikhil's Karthikeya 2

సంబంధిత కథనాలు

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

టాప్ స్టోరీస్

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?