Nayanthara: గ్రాండ్‌గా నయన్ బర్త్‌డే సెలబ్రేషన్స్... అక్కడే సమంత కూడా!
నయనతార పుట్టినరోజును దర్శకుడు విఘ్నేష్ శివన్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అన్నట్టు... సమంత కూడా అక్కడే ఉన్నారు. ఇంతకీ, బర్త్‌డే ఎక్కడ జరిగింది? ఏమిటి? అంటే...

అది బుధవారం అర్ధరాత్రి... చెన్నైలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశం... సమయం పన్నెండు గంటలు అయ్యేసరికి సడన్‌గా ఆకాశంలో క్రాకర్స్ పేలాయి. సెట్‌లో కేకులు ప్రత్యక్షం అయ్యాయి. అందులో ఓ కేకు మీద 'హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్' అనే అక్షరాలు. ఇదంతా నయనతార కోసమే! దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన ఏర్పాట్లే! వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేయసి కోసం ఆయన చాలా చేశారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే... తమిళ సినిమా 'కాతువాకుళే రెండు కాదల్' సెట్‌లో!
కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'కాతువాకుళే రెండు కాదల్' సినిమాలో నయనతార ఓ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. ఈ రోజు (నవంబర్ 18, గురువారం) నయనతార పుట్టినరోజు సందర్భంగా సెట్‌లో ఆమె బర్త్ డేను విఘ్నేష్ శివన్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. నయన్ (nayan) అక్షరాలతో కేకులు చేయించారు. మరో కేకు మీద 'హ్యాపీ బర్త్ డే లేడీ సూపర్ స్టార్' అని రాయించారు. సెట్ మొత్తం కేకులే. వీటికి తోడు పన్నెండు గంటలు కాగానే ఆకాశం అంతా క్రాకర్స్ వెలుగులతో నిండింది. 'కాతువాకుళే రెండు కాదల్'లో సమంత మరో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఆమె కూడా అక్కడే ఉన్నారు. అంతా పూర్తయ్యాక రాత్రి రెండున్నర గంటల తర్వాత షూటింగ్‌కు ప్యాకప్ చెప్పారు. కేక్ కట్ చేసే ముందు విఘ్నేష్ శివన్‌ను నయనతార హగ్ చేసుకున్నారు.
Happy birthday Kanmani Thangamey my ellamey 😘😘🥰😍😍😍😍☺️☺️☺️😊😇😇😇😇😇😇😇
— Vignesh Shivan (@VigneshShivN) November 17, 2021
Stay blessed and be the same unique , beautiful , powerful , strong person that u r , forever 😘🥰🥰
Cheers To a life filled with only success & happy moments 😘☺️🥰
Godbless you #HBDNayanthara pic.twitter.com/3z4zFZ7ZAK
నయనతార బర్త్ డేను సెలబ్రేట్ చేయడంతో పాటు 'కాతువాకుళే రెండు కాదల్' సినిమాలో ఆమె లుక్‌తో కూడిన ఓ పోస్టర్ విడుదల చేశారు... బర్త్ డే విషెష్ చెబుతూ! ప్రస్తుతం ఈ సినిమాతో పాటు హిందీలో షారుఖ్ ఖాన్ సరసన ఓ సినిమా చేస్తున్నారు.
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















