Navneeth Kaur: 'పుష్ప' డైలాగ్ చెప్పిన లేడీ ఎంపీ, వైరలవుతోన్న వీడియో
మహారాష్ట్ర ఎంపీ, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ 'పుష్ప' సినిమాలో డైలాగ్స్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
2021 డిసెంబర్ లో విడుదలైన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. సినిమా స్టార్స్, క్రికెటర్స్ ఇలా చాలా మంది 'పుష్ప' సాంగ్స్ కి డాన్స్ చేస్తూ.. సినిమాలో డైలాగ్స్ చెబుతూ వీడియోలు షేర్ చేస్తున్నారు. 'తగ్గేదేలే' అనే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సినిమా విడుదలైన మూడు నెలలు దాటుతున్నా.. ఇప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
తాజాగా మహారాష్ట్ర ఎంపీ, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్ కూడా 'పుష్ప' సినిమాలో డైలాగ్స్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. కాదు ఫైర్ అనే డైలాగ్ ను హిందీలో చెప్పి ఆకట్టుకుంది నవనీత్. 'పుష్ప'కి బదులుగా తన పేరు చెప్పుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నవనీత్. దీంతో ఇది బాగా వైరల్ అవుతుంది. తెలుగులో 'శీను వాసంతి లక్ష్మి', 'జగపతి', 'యమదొంగ' వంటి సినిమాల్లో నటించింది నవనీత్. ఆ తరువాత రవిరాజా అనే రాజకీయనాయకుడిని పెళ్లి చేసుకొని ఇప్పుడు రాజకీయాల్లో సెటిల్ అయింది.
ఇక 'పుష్ప' సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటించింది. అలానే సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
View this post on Instagram