By: ABP Desam | Updated at : 22 Jan 2022 03:36 PM (IST)
ఆ చెత్త వార్తలు బాధపెట్టాయంటున్న నాగ్..
టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి మూడు నెలలు దాటేసింది. అయినప్పటికీ వీరికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్న సమయంలో సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరిగాయి. సమంత బోల్డ్ రోల్స్ లో నటించడం అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని.. ఆమెకి రూల్స్ పెట్టడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ వార్తలపై నాగచైతన్య తండ్రి, ప్రముఖ హీరో నాగార్జున స్పందించారు. రీసెంట్ గా చైతుతో కలిసి ఓ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు నాగ్. ఈ సందర్భంగా ఆయనకు చైతు-సమంతల విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. విడాకుల సమయంలో వచ్చిన వార్తలపై ఆయన మాట్లాడుతూ.. కొంతమంది కావాలనే చెత్త వార్తలు సృష్టించారని.. తనపై తప్పుడు వార్తలు రాసినా పెద్దగా పట్టించుకోలేదు కానీ తన ఫ్యామిలీ గురించి నెగెటివ్ గా వార్తలు రాయడం మాత్రం చాలా బాధించిందంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.
ఇదే విషయంపై చైతు మాట్లాడుతూ.. అలాంటి వార్తలను పట్టించుకోనని అన్నారు. రీసెంట్ గా 'బంగార్రాజు' సినిమా ప్రమోషన్స్ లో కూడా పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. ఇప్పుడు సమంత, తను ఇద్దరం సంతోషంగా ఉన్నామని అన్నారు చైతు. 2017లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సమంత 'యశోద' సినిమాలో నటిస్తున్నారు. అలానే ఓ బైలింగ్యువల్ సినిమా, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరోపక్క చైతు 'థాంక్యూ' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నారు. ఈ ఏడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Also Read: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..?
Also Read: నాని సినిమాలో మలయాళ హీరోకి ఛాన్స్..
Also Read: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..
Also Read: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..
Gargi Trailer: 'గార్గి' ట్రైలర్ - తండ్రి కోసం కూతురు చేసే న్యాయ పోరాటం
Mega154: చిరు సినిమా నుంచి మాస్ హీరో తప్పుకున్నాడా?
Kangana Ranaut: మా నిర్మాత ఆఫీసు అమ్ముకోలేదు - బాలీవుడ్ మీడియాపై కంగనా రనౌత్ ఫైర్
Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' - టీవీలోనూ వర్కవుట్ కాలేదే!
Ennenno Janmala Bandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి
YSRCP Plenary 2022 : ప్లీనరీ సక్సెస్ చూసి చంద్రబాబు మళ్లీ బోరు బోరున ఏడుస్తారు - ఎంపీ విజయసాయి రెడ్డి
IND-W vs SL-W, 3rd ODI: హర్మన్ ప్రీత్ డిస్ట్రక్షన్! లంకను కుప్పకూల్చిన రాజేశ్వరీ, మేఘనా
Multibagger stock: ఏడాదిలో లక్షకు రూ.13 లక్షల ప్రాఫిట్! 800% ర్యాలీ చేసిన మల్టీబ్యాగర్
Auto Insurance new Rules: వాహన బీమా రూల్స్ ఛేంజ్! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!