Naga Shaurya: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..
ఈరోజు శౌర్య పుట్టినరోజు కానుకగా ఆయన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం
యంగ్ హీరో నాగశౌర్య డిఫరెంట్ జోనర్స్ లో కథలను ఎన్నుకుంటూ నటుడిగా తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో అతడు సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాడు. రీసెంట్ గా విడుదలైన 'లక్ష్య' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
అందులో ఒకటి తన సొంత బ్యానర్ లో చేస్తున్నాడు. అనీష్ ఆర్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు శౌర్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకి 'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో శౌర్య ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు.
నిలువు బొట్టు, గంధం, చేతిలో ఇత్తడి చెంబు, మావిడాకులు చూస్తుంటే ఇందులో శౌర్య బ్రాహ్మణుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. టైటిల్ ప్రకారం.. ఇందులో కృష్ణ అనే క్యారెక్టర్ పోషించబోతున్నారు శౌర్య. ఈ సినిమాలో షిర్లీ సేతియా హీరోయిన్ గా కనిపించనుంది. నటి రాధిక కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ లాంటి నటులు కనిపించనున్నారు. ఉష ముల్పూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మహతి స్వాగర్ సంగీతం అందిస్తున్నారు.
#IRA4 Update is here!
— VamsiShekar (@UrsVamsiShekar) January 22, 2022
A love tale of Krishna & Vrinda 🤩@IamNagashaurya ’s #NS22 titled as #𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐕𝐫𝐢𝐧𝐝𝐚𝐕𝐢𝐡𝐚𝐫𝐢 ✨#HBDNagaShaurya ❤️@ShirleySetia #AneeshKrishna #SaiSriram @realradikaa @mahathi_sagar @YEMYENES @ira_creations @UrsVamsiShekar pic.twitter.com/u8Qg04rirj
Also Read: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..
Also Read: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి