అన్వేషించండి
Advertisement
Official: 'అల.. వైకుంఠపురములో' హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు
'అల వైకుంఠపురములో' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.
సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే మన సౌత్ హీరోలకు బాలీవుడ్ లో పాపులారిటీ దక్కింది. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టడంతో ఆయన నటించిన పాత సినిమాలను హిందీలో డబ్ చేయడానికి రెడీ అయ్యారు కొందరు నిర్మాతలు.
ముందుగా 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను జనవరి 26న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గోల్డ్ మైన్స్, ఏఏ ఫిల్మ్స్ అనౌన్స్ చేశాయి. నిజానికి ఈ సినిమా రీమేక్ బాలీవుడ్ లో తెరకెక్కుతోంది. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా.. దర్శకుడు రోహిత్ ధావన్ ఈ సినిమాను మొదలుపెట్టారు. దీనికి 'షెహ్ జాదా' అనే టైటిల్ కూడా పెట్టారు. 'అల.. వైకుంఠపురములో' తెలుగు వెర్షన్ ను నిర్మించిన అల్లు అరవింద్.. భూషణ్ కుమార్, అమన్ గిల్ లతో కలిసి హిందీ రీమేక్ నిర్మిస్తున్నారు.
అయితే రీమేక్ అవుతున్న సినిమా డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తుండడం హాట్ టాపిక్ అయింది. కచ్చితంగా ఈ డబ్బింగ్ వెర్షన్.. రీమేక్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని అందరూ అనుకున్నారు. దీంతో అల్లు అరవింద్ గోల్డ్ మైన్స్ నిర్మాతలను కలిసి డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ ను క్యాన్సిల్ చేయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
— Goldmines Telefilms (@GTelefilms) January 21, 2022
Also Read: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..
Also Read: 'లైగర్'లో ఐటెం సాంగ్.. పూరి ప్లాన్ ఇదే..
Also Read: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion