అన్వేషించండి
Advertisement
Keerthi Suresh: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..
'సఖి వచ్చేస్తోంది' అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువ మంది మహిళా సభ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలమవుతున్నప్పటికీ.. కరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయింది. మధ్యలో సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం ఆ వార్తలను కొట్టిపారేసింది.
2021, నవంబర్ 26న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన కొన్ని రోజులకు పరిస్థితుల దృష్ట్యా.. డిసెంబర్ 10న రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ టైంకి కూడా 'గుడ్ లక్ సఖి' రాలేదు. తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 'సఖి వచ్చేస్తోంది' అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జనవరి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్ పాత్రలో కనిపించనుంది. ఓ పల్లెటూరి అమ్మాయి నేషనల్ లెవెల్ షూటర్ గా ఎలా ఎదిగిందనేదే సినిమా.
నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న 'గుడ్ లక్ సఖి' సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సఖి వచ్చేస్తొంది ✨
— Keerthy Suresh (@KeerthyOfficial) January 21, 2022
We are so excited for you guys to see #GoodLuckSakhi in the theaters near you from 28th Jan 😊❤️#GoodLuckSakhiOn28thJan@AadhiOfficial #NageshKukunoor @ThisIsDSP #DilRaju @sudheerbza @shravyavarma @WorthAShotArts #VyshnaveeFilms @MangoMusicLabel pic.twitter.com/R21k9hqm3L
Also Read: 'లైగర్'లో ఐటెం సాంగ్.. పూరి ప్లాన్ ఇదే..
Also Read: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'
Also Read: రవితేజ కెరీర్లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్కు ఈ సినిమా సో స్పెషల్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion