News
News
X

Liger: 'లైగర్'లో ఐటెం సాంగ్.. పూరి ప్లాన్ ఇదే..

'లైగర్' కోసం కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ను రెడీ చేస్తున్నారట.

FOLLOW US: 
భారీ బడ్జెట్ సినిమా అంటే అందులో కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి ఈ ఐటెం సాంగ్స్ బాగా ఉపయోగపడతాయి. అందుకే ఎంత పెద్ద దర్శకుడైనా.. తన సినిమాలో కచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండేలా చూసుకుంటారు. ఇటీవల విడుదలైన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. 
 
ఇప్పుడు 'లైగర్' కోసం కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ను రెడీ చేస్తున్నారట. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ప్రతీది పెర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఐటెం సాంగ్ ను గ్రాండ్ గా చిత్రీకరించాలని భావిస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్ తో సాంగ్ చేయించాలని చూస్తున్నారు. పూరి జగన్నాధ్ చాలా మంది అగ్ర హీరోయిన్స్ తో కలిసి పని చేశారు. ఆయన అడిగితే కచ్చితంగా హీరోయిన్లు ఒప్పుకుంటారు. కానీ పూరి మాత్రం ఇప్పటివరకు ఐటెం సాంగ్ లో కనిపించని హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారు. 
 
ప్రస్తుతం ఉన్న తారలంతా కూడా ఐటెం సాంగ్స్ లో నటించినవారే. మరి పూరికి ఎవరు దొరుకుతారో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థాయ్‌లాండ్‌ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
 
Also Read: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'

Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!

Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

News Reels

Published at : 21 Jan 2022 03:36 PM (IST) Tags: Puri Jagannadh Liger Movie Vijay Deverakonda Liger item song

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

No Teachers in Elections Duties : ఏపీలో టీచర్లకు బోధనేతర విధులకు సెలవు ! టీచర్ల కష్టాలను గుర్తించారా ? ఎన్నికల విధులకు దూరం చేసే వ్యూహమా ?

No Teachers in Elections Duties :  ఏపీలో టీచర్లకు బోధనేతర విధులకు సెలవు ! టీచర్ల కష్టాలను గుర్తించారా ? ఎన్నికల విధులకు దూరం చేసే వ్యూహమా ?

IND vs NZ 3rd ODI: నేడు కివీస్ తో నిర్ణయాత్మక వన్డే- భారత్ సిరీస్ ను సమం చేస్తుందా!

IND vs NZ 3rd ODI: నేడు కివీస్ తో నిర్ణయాత్మక వన్డే- భారత్ సిరీస్ ను సమం చేస్తుందా!

TS Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ - 16,940 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

TS Jobs: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ - 16,940 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు