Laal Singh Chaddha Release Date: రూమర్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్.. చెప్పిన టైంకే సినిమా..
'లాల్ సింగ్ చద్దా' చెప్పినట్లుగానే ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుందని.. అందులో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు
![Laal Singh Chaddha Release Date: రూమర్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్.. చెప్పిన టైంకే సినిమా.. Aamir khan's Laal Singh Chaddha release date announced, know in details Laal Singh Chaddha Release Date: రూమర్లకు చెక్ పెట్టిన ఆమిర్ ఖాన్.. చెప్పిన టైంకే సినిమా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/21/00098ae79dc9fc5dac365e5ec8556e0d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'లాల్ సింగ్ చద్దా'. మొదట ఈ సినిమా 2021 డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ టైంకి రాలేదు. ఆ తరువాత ప్రేమికుల రోజు నాడు సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. ఫైనల్ గా ఏప్రిల్ 14, 2022న థియేటర్లలోకి రానున్నట్లు అనౌన్స్ చేశారు. అదే తేదీన 'కేజీఎఫ్ 2' లాంటి పాన్ ఇండియా సినిమా రానున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆమిర్ ఖాన్ సినిమా వాయిదా పడుతుందనే సందేహాలు కలిగాయి.
అలాంటి అనుమానాలకు తెరదించుతూ చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'లాల్ సింగ్ చద్దా' చెప్పినట్లుగానే ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుందని.. అందులో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్ పై వస్తోన్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని చెప్పారు. ఈ సినిమా మేకింగ్ జర్నీలో తమకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.
ఇక ఈ సినిమా టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్. ఇంతకుముందు అమీర్‌తో కలిసి 'సీక్రెట్ సూపర్‌స్టార్' (2017) తీసిన అద్వైత్ చందన్ ఈ హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో బ్యానర్‌లో రానుంది. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. 'లాల్ సింగ్ చద్దా' సినిమాకు ఎరిక్ రోత్, రచయిత అతుల్ కులకర్ణి స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, మోనా సింగ్ తదితరులు కూడా నటించారు.
Also Read: 'సఖి వచ్చేస్తోంది..' కీర్తి సినిమా కొత్త రిలీజ్ డేట్..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)