Marakkar: ఒక్క రోజు ఆలస్యంగా 'మరక్కార్'... గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్!
ఒక్క రోజు ఆలస్యంగా 'మరక్కార్' ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హిస్టారికల్ మూవీ 'మరక్కార్: లయన్ ఆఫ్ ద అరేబియన్ సీ'. తెలుగులో 'మరక్కార్: అరేబియా సముద్ర సింహం' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసింది. ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసింది. అయితే... విడుదలలో చిన్న మార్పు. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఇప్పుడు ఒక్క రోజు ఆలస్యంగా వస్తోంది. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'మరక్కార్' సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డులు అందుకుని ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. మలయాళంలో మాత్రమే కాకుండా... తెలుగులో కూడా సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 'మన్యం పులి'తో తెలుగులోనూ మోహన్ లాల్ మంచి విజయం అందుకున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారెజ్'తో మరో బ్లాక్ బస్టర్ ఆయన ఖాతాలో పడింది. ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, 'కిచ్చా' సుదీప్, ప్రభు, మంజూ వారియర్, కీర్తీ సురేష్, కళ్యాణీ ప్రియదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో 'పిలిచాను తల్లి...' పాటను ఈ రోజు విడుదల చేశారు. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
'పిలిచాను తల్లి...' సాంగ్:
Presenting the lyrical video of #NeeyeEnThaaye song!
— Mohanlal (@Mohanlal) November 26, 2021
Malayalam : https://t.co/8augaiAy5c
Tamil : https://t.co/sNn5pXXxYB
Hindi : https://t.co/poSNqmr3ud
Kannada : https://t.co/bGfvKayz2E#MarakkarArabikadalinteSimham #MarakkarFromDec2
Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
Also Read: ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే సాయి ధరమ్ తేజ్ ఫొటోలు వచ్చాయి! సక్సెస్ సెలబ్రేషన్స్‌లో...
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు చిరంజీవి సాయం! మాస్టర్ కుమారుడిని ఇంటికి పిలిపించుకుని...
Also Read: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
Also Read: ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి