By: ABP Desam | Updated at : 24 Mar 2023 12:51 AM (IST)
Edited By: Mani kumar
Image Credit: Mohan Babu/Instagram
సినిమా రంగంలో సెలబ్రెటీల మీద నిత్యం ఏదొక పుకార్లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నటీనటుల సినిమా వార్తల కంటే కూడా వారి వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన వాటిపై నిత్యం ఏదొక పుకార్లు వస్తూనే ఉంటాయి. అయితే వాటిని కొంతమంది యాక్టర్స్ లైట్ తీసుకుంటారు. మరికొంత మంది సీరియస్ అవుతారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ వివాహం ఘనంగా జరిగింది. కర్నూలుకు చెందిన భూమా మౌనిక రెడ్డిను రెండో వివాహం చేసుకున్నారు మనోజ్. అయితే వీరి పెళ్లిపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వాటిల్లో ఒకటి ఈ పెళ్లి అసలు మనోజ్ తండ్రి మోహన్ బాబుకు ఇష్టం లేదు అని, అందుకే పెళ్లి లేట్ అవుతూ వస్తుంది అని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై మోహన్ బాబు ఇప్పటివరకూ స్పందించలేదు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ పెళ్లిపై వస్తోన్న పుకార్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంచు మనోజ్ చాలా ఏళ్ళ నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన చాలా రోజుల తర్వాత వినాయక చవితి పండుగ సమయంలో భూమా మౌనిక రెడ్డితో కలిసి కనిపించారు. అప్పటి నుంచీ వారి ప్రేమ, పెళ్లిపై విపరీతంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిందనీ, పెళ్లి తేదీ కూడా ఓకే అయిపోయిందని వార్తలు వచ్చాయి. వీటితోపాటు మరో వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదేంటంటే.. ఈ పెళ్లి అసలు మోహన్ బాబుకు ఇష్టం లేదని, ఆయన ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలు వారి పెళ్లి ముందురోజు వరకూ వస్తూనే ఉన్నాయి. అయితే పెళ్లిలో మోహన్ బాబు దంపతులు కూడా ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఆ వార్తలకు చెక్ పడింది. అంతేకాదు మనోజ్ పెళ్లి లో మోహన్ బాబు ఎమోషనల్ అయిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై మోహన్ బాబు స్పందించారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని వస్తోన్న వార్తలు అవాస్తవాలని అన్నారు. అవన్నీ పనికిమాలిన ప్రచారాలని కొట్టిపారేశారు. మనోజ్ తన దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, ఓసారి ఆలోచించమని చెప్పానని చెప్పారు. దానికి మనోజ్ ‘‘నేను తీసుకున్న నిర్ణయం మంచిదేనని భావిస్తున్నాను’’ అని చెప్పాడని, తాను ‘‘ఇంకేముంది చేసుకో.. ఆల్ ది బెస్ట్’’ అని చెప్పానని మోహన్ బాబు అన్నారు. కాదని తానెందుకు చెబుతానని పేర్కొన్నారు. ఎవరో ఏదో అనుకుంటే వాటిని తాను పట్టించుకోనని, మన పని మనం చేసుకుంటూ పోవాలి కానీ ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకు ఆలోచించాలి అని వ్యాఖ్యానించారు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, మనం ఆ శబ్దం కూడా వినలేనట్టు ప్రయాణం సాగించాలని, అప్పుడే అనుకున్నది సాధిస్తామని అన్నారు. మొత్తానికి మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్ అనే వార్తలకు తనదైన శైలిలో చెక్ పెట్టారు మోహన్ బాబు.
Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?