Mehreen: తెలుగులోనూ అలాంటి ఛాన్స్ వస్తే చేస్తా - అందుకే బరువు పెరిగా: మెహ్రీన్
Mehreen: హిందీలో చేసిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ మంచి గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పింది హీరోయిన్ మెహ్రీన్. తెలుగులోనూ అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించింది.
Mehreen On Telugu OTT: సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అవకాశం ఎక్కడ వచ్చినా అందిపుచ్చుకుంటుంది హీరోయిన్ మెహ్రీన్. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గత 8 ఏండ్లుగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ప్రతి సినిమాలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ‘స్పార్క్ లైఫ్’ అనే మూవీతో ఇవాళ (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో విక్రాంత్ హీరోగా నటిస్తూనే, దర్శకత్వం వహించాడు.
కలల్ని సాకారం చేసుకునే యువతి పాత్రలో మెహ్రీన్
‘స్పార్క్ లైఫ్’ సినిమా విడుదల సందర్భంగా మెహ్రీన్ అభిమానులతో పలు విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో తను లేఖ అనే అమ్మాయి పాత్రలో నటించినట్లు చెప్పింది. తన కలలను నెరవేర్చుకునేందుకు ఓ యువతి చేసే ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించినట్లు తెలిపింది. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ తో పాటు లుక్ లుక్ కూడా ఆకట్టుకుంటుందని చెప్పింది. విక్రాంత్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చెప్పింది. ఈ చిత్రం తప్పకుండా మంచి రిజల్ట్ అందుకుంటుందని మెహ్రీన్ వెల్లడించింది.
తెలుగు సినిమాలు చక్కటి గుర్తింపు తెచ్చాయి- మెహ్రీన్
ఇక తెలుగులో చేసిన అన్ని సినిమాలో తనకు ఎన్నో మంచి గుర్తింపు తీసుకొచ్చాయని మెహ్రీన్ వివరించింది. ప్రతి సినిమా నటిగా తనకు ఎంతో ప్రత్యేకమైనది వెల్లడించింది. ఏ సినిమా చేసినా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. నటిగా తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించింది. తొలి సినిమాలోనే రాయలసీమకు చెందిన పల్లెటూరి అమ్మాయిలా నటించాల్సి వచ్చిందన్నారు. అప్పటి వరకు కెనడాలో పెరిగిన తనకు ఇక్కడ భాష, వేషం, చాలా కొత్తగా అనిపించాలని చెప్పింది. అయినా కష్టపడి నటించినట్లు చెప్పింది. ఇక ‘ఎఫ్ 2’ చిత్రం సందర్భంగా అనీల్ రావిపూడి లాంటి దర్శకుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని శక్తివంచన లేకుండా నిలబెట్టే ప్రయత్నం చేసినట్లు చెప్పింది. ఒక్కో సినిమాకు ఒక్కో రకమైన క్యారెక్టర్ చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించింది. తన సినిమాలను ప్రేక్షకులు చక్కగా ఆదరించడం సంతోషంగా ఉందని చెప్పింది.
తెలుగులో అలాంటి అవకాశాలు వస్తే చేస్తా- మెహ్రీన్
ఇక ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు మెహ్రీన్ వెల్లడించింది. తెలుగులో ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదని తెలిపింది. హిందీలో చేసిన ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ పెద్ద చర్చకు దారితీసినట్లు వెల్లడించింది. తెలుగులోనూ అలాంటి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పింది. ఇక తన ఫిజిక్ గురించి మెహ్రీన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. చిన్నప్పటి నుంచి తాను బొద్దుగానే కనిపిస్తానని చెప్పింది. సన్నగా మారితే బాగుంటుందని చెప్పడంతో వర్కౌట్స్ చేసిన సన్నబడ్డానని చెప్పింది. అయితే, మరికాస్త బరువు పెరగాలని చెప్పడంతో ఇప్పుడు కాస్త బరువు పెరిగినట్లు చెప్పింది. ఇకపై ఇదే లుక్ లో కనిపించాలని ఫిక్స్ అయినట్లు చెప్పింది.
Read Also: ఆ విషయంలో సంతృప్తి లేదు - అందుకే టాలీవుడ్ కు గ్యాప్ వచ్చింది: హన్సిక