అన్వేషించండి

God Father: 'గాడ్ ఫాదర్' ఒక నిశ్శబ్ద విస్ఫోటనం - ఒక్క మాటలో చెప్పేసిన చిరు!

'గాడ్ ఫాదర్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. 

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. ఫ్లైట్ లో ఈ ఇంటర్వ్యూని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ కనిపించారు. 'గాడ్ ఫాదర్' ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అని ఒక్క మాటలో సినిమా గురించి చెప్పేశారు. 

సినిమాలో హీరోయిన్ లేదని కానీ.. ఎక్కువ సాంగ్స్ లేవని అలాంటి ఆలోచన రాకుండా చేసే సబ్జెక్ట్ 'గాడ్ ఫాదర్' అని చెప్పారు. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఆరో ప్రాణమని అన్నారు. పూర్తి ఇంటర్వ్యూ సెప్టెంబర్ 25న విడుదలవుతుందని ప్రకటించారు. మలయాళ 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారట.

Netflix bags the Digital Rights of God Father: మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేస్తున్నారు. రీసెంట్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ను అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ రేటుకి ఈ హక్కులను అమ్మారట. ఎంత మొత్తమనేది బయటకు రాలేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ను అనంతపూర్ లో నిర్వహించాలనుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. 

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి  కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.

Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

Also Read : హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?

టాప్ హెడ్ లైన్స్

Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
The Paradise Teaser : నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
The Taj Story OTT : మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget