God Father First Single: మెగా మాస్ సాంగ్ వచ్చేసింది - అటు చిరు, ఇటు సల్మాన్ ఇక రచ్చ రచ్చే!
'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్'(God Father) అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. సెప్టెంబర్ 15న సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు.
'తార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ మాస్ స్టెప్స్ వేస్తూ కనిపించారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకి అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ సాంగ్ కంపొజిషన్ విషయంలో తమన్ పై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెండితెరపై ఈ సాంగ్ వస్తే థియేటర్లో రచ్చ చేయడం ఖాయం.
#ThaarMaarThakkarMaar out on @spotifyindia 🎧
— Konidela Pro Company (@KonidelaPro) September 15, 2022
Telugu- https://t.co/I454U8Id23
Hindi- https://t.co/FMhF2wXoBp
Lyrical soon!#GodFather@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @PDdancing @shreyaghoshal @AlwaysRamCharan @ProducerNVP @saregamasouth pic.twitter.com/RGm7KppHAE
ఈ సినిమాలో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ యనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. చిత్రంలో నయనతారను ‘సత్యప్రియ జై దేవ్’ గా పరిచయం చేశారు. ఈ సినిమాలో గాడ్ ఫాదర్ పాత్రను అసహ్యించుకొనే క్యారెక్టర్ లో నయనతార కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నయనతార సీరియస్ లుక్ లో ఆకట్టుకునేలా ఉన్నారు.
ఈ సినిమాలో నయన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట దర్శకుడు. అయితే, ఇక మోహన్‌లాల్ ఒరిజినల్ 'లూసీఫర్' సినిమాలో హీరోయిన్ లేదు. మరి తెలుగులో ఉంటుందా? లేదా? అనేది మాత్రం తెలియదు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారట. అటు ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి, నయనతార మరోసారి ఈ సినిమాలో నటించబోతున్నారు.
మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన 'లూసిఫర్' సూపర్ సక్సెస్ సాధించింది. పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధించింది. అదే రేంజిలో ఇక్కడ కూడా సినిమా సక్సెస్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ సినిమాలో ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వం మరో సినిమా చేస్తున్నారు.