By: ABP Desam | Updated at : 08 Oct 2021 08:27 AM (IST)
Edited By: RamaLakshmibai
(Image Credit/ Chiranjeevi Konidela Twitter) కొండపొలం
‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కొండపొలం'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చేసింది. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, ఇప్పటికే విడుదలైన పాటలు మంచి టాక్ సంపాదించుకున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్స్ చేశారు..
Just watched #KondaPolam
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021
A beautiful rustic love story with a powerful message. I love how Krish always deals with different genres & picks pertinent issues & extracts fantastic performances from artists.I trust this film will win as much acclaim & awards as it will get rewards. pic.twitter.com/tv4bZTv07q
ఈ సినిమా పై ఏమన్నారంటే.."కొండపొలం సినిమా ఇప్పుడే చూశాను, పవర్‌ఫుల్ సందేశంతో కూడుకున్న అందమైన గ్రామీణ ప్రేమ కథ ఇది. ఎప్పుడూ విభిన్న కథలు ఎంచుకుని, నటీనటుల నుంచి చక్కని నటన రాబట్టగల సత్తా క్రిష్‌కి ఉందని, ఈ చిత్రం ఎంతో మంది ప్రశంసలు, ఎన్నో అవార్డులను గెలుస్తుందని ఆశిస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Hearty Congratulations to @DirKrish #PanjaVaisshnavTej @Rakulpreet @mmkeeravaani & entire team of @FirstFrame_Ent for this excellent piece of work.This will certainly be a milestone in your careers.God Bless you all! #KondaPolam
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021
వాస్తవానికి తాను కొండపొలంకు సంబంధించిన ఎలాంటి బుక్ చదవలేదని.. ఓ రోజు వైష్ణవ్ వచ్చి క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేస్తున్నాననని చెప్పగానే సరే అన్నానన్నారు. ఎందుకంటే క్రిష్ దర్శకత్వంలో విభిన్న పాత్రల్లో నటించే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో సరే అని చెప్పా. అయితే తాను ఏదనకున్నానో అంతకుమించి ఉందని అభినందించారు. వైష్ణవ్ తేజ్ పెర్ఫామెన్స్, క్యారెక్టరైజేషన్ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయన్నారు. క్రిష్ సినిమాలు ఒకదానితో మరొకటి సంబంధం ఉండదన్న చిరంజీవి.. గత చిత్రాల కన్నా పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆహ్వానించాలన్నారు మెగాస్టార్.
Your each and every pat on my back throughout my career is giving me the strength n fortitude to move forward and persevere sir. You are such a rare and beautiful soul and my sincere thanks once again @KChiruTweets sir 🙏🏻🤗🙏🏻 pic.twitter.com/M9R03MWy1V
— Krish Jagarlamudi (@DirKrish) October 7, 2021
కొండపొలం సినిమాకు చిరంజీవి నుంచి దక్కిన అభినందలకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు క్రిష్.
Thank you Megastar @KChiruTweets garu for your Love & Support ❤🤝
— First Frame Entertainments (@FirstFrame_Ent) October 7, 2021
As you trust in this film will win awards, we believe that it can make wonders💫
Your blessings is all we need#PanjaVaisshnavTej @RakulPreet @DirKrish @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel pic.twitter.com/guM4Bo3Ktl
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు.
so Read: సన్నీ రాజ్యానికి బిగ్ బాస్ ఝలక్.. షణ్ముఖ్ టీమ్‌కు షాక్.. కెప్టెన్‌గా ప్రియా!
Also Read: టార్గెట్ హమీదా.. మళ్లీ కెప్టెన్ అవుతానంటున్న శ్రీరామ్.. ఎవరూ తగ్గట్లేదు!
Also Read:అమ్మకు ప్రేమతో.. జాన్వీ చేతిపై ఈ టాటూ ప్రత్యేకత తెలుసా?
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!
Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు