News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5: సన్నీ రాజ్యానికి బిగ్ బాస్ ఝలక్.. షణ్ముఖ్ టీమ్‌కు షాక్.. కెప్టెన్‌గా ప్రియా!

ఈ రోజు ప్రసారమైన బిగ్ బాస్ 3 తెలుగు ఎపిసోడ్ 33లో ఊహించని షన్ను రాజ్యానికి షాక్ తప్పలేదు. నాణేలు సంపాదించినా.. ఒక్కరు కూడా కెప్టెన్సీ పోటీదారులుగా నిలబడలేకపోయారు.

FOLLOW US: 
Share:

కెప్టెన్సీ కోసం ‘బిగ్ బాస్’ పెట్టిన టాస్క్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’లో ఈ రోజు ఎపిసోడ్‌తో ముగిసింది. టాస్క్ పూర్తయినా.. ఫలితాల కోసం తర్వాతి రోజు వరకు వేచి చూడాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో సభ్యుల టెన్షన్ తర్వాతి రోజుకు వాయిదా పడింది. పుష్పలోని ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్‌తో నిద్రలేచిన సభ్యులకు అసలైన ఛాలెంజ్ ఈ రోజే ఉండబోతుందని అర్థం చేసుకున్నారు. తమ తమ స్ట్రాటజీలతో రాజు పాత్రదారులైన రవి, సన్నీలను ముప్పు తిప్పలు పెట్టారు. తమ రాజ్యంలో ఉన్న ప్రజలే వెన్నుపోటు పొడుస్తారేమో అనే సందేహంతో రాజులిద్దరు చర్చించుకున్నారు. 

హమీదాను టార్గెట్ చేసుకున్న షన్ముఖ్, యానీ మాస్టర్: ఇంట్లోని కొంతమంది సభ్యులు హమీదాను టార్గెట్ చేసుకున్నారు. హమీదాను ఈసారి కెప్టెన్ చేసేందుకు శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడని యానీ మాస్టార్, షన్ముఖ్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా యానీ మాస్టార్ శ్వేతతో మాట్లాడుతూ.. హమీదా, శ్రీరామ్ లవ్ స్టోరీ నడుపుతున్నారని, ఒకరు కెప్టెనైతే ఇంకొకరు రేషన్ మేనేజర్ అనుకుంటారని.. నేను కెప్టెనైతే నిన్ను రేషన్ మేనేజర్‌గా తీసుకోనని, తల్లికూతురు ప్రేమ ఈ విషయంలో చెల్లదని, ఎవరు అర్హులైతే వారికే అది ఇస్తానని యానీ తెలిపింది. ఒక వేళ హమీదా కెప్టెన్‌‌గా ఎంపికైతే.. శ్రీరామ్ రేషన్ మేనేజర్ అవుతాడని షన్ముఖ్.. జస్సీతో అన్నాడు. 

ప్రియాంకకు బిగ్ బాస్ సర్‌ప్రైజ్: ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో ప్రియాంక పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘‘నాన్న సాయితేజా.. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సర్వం నువ్వే మాకు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని ప్రియాంక తండ్రి ఆమె పురుషుడి నుంచి స్త్రీగా మారడాన్ని అంగీకరిస్తున్నట్టు తెలిపారు. తండ్రి మాటలు విని ప్రియాంక సింగ్‌ భావోద్వేగానికి లోనైంది.  తన ఇంటికి తాను దొంగలా వెళతానని.. బయటకు కూడా రానని.. కనీసం పక్కింటి వాళ్లకి కూడా తెలియదని కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నన్ను అంగీకరించడంతో ఎప్పటిలానే ఇంటికి రావొచ్చానంది. డాడీ ఐ లవ్ యూ అంటూ ఏడ్చేసింది. ఇంటి సభ్యులంతా కూడా ఎమోషనల్‌ అయ్యారు. పూలు, బొట్టు తీసుకొచ్చి ప్రియాంక సింగ్‌ను అందంగా అలంకరించారు. అనంతరం ప్రియాంక సన్నీ, మానస్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది.

పాపం.. సన్నీ లెక్క తప్పింది: బిగ్ బాస్ నాణేల లెక్క అడిగాడు. రాజు సన్నీ వద్ద 30, మానస్ 240, షన్ముఖ్ 220, జస్సీ 209, రవి 50, యానీ 176, హమీద 60, విశ్వ 10, శ్రీరామ చంద్ర 53, ప్రియా వద్ద సున్నా నాణాలు ఉన్నాయని శ్రీరామ చంద్ర చెప్పాడు. ఇష్టమైన రాజుకు మద్దతు తెలిపే అవకాశాన్ని సభ్యులకు ఇచ్చాడు బిగ్ బాస్. సన్నీ వద్ద తక్కువ మంది సభ్యులు ఉండటంతో ఎవరైనా సపోర్ట్ చేయడానికి తన వద్దకు రావచ్చని అడిగాడు. కెప్టెన్సీ కంటెస్టెంట్లకు అర్హతకు అవసరమైన నాణేలు నీ వద్దే ఉన్నాయని యానీ మాస్టర్ అన్నారు. ఇద్దరు రాజకుమారుల వద్ద.. సన్నీ వద్ద 6, రవి వద్ద 7 ప్రజలు ఉన్నారు. ఎక్కువ మంది ప్రజలతో రవి కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడు. రాజుగా రవికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిపై పూలు చల్లి ఘన సత్కారం చేశారు. యానీ మాస్టార్ కిరిటం తొడిగి పట్టాభిషేకం నిర్వహించారు. అయితే, సన్నీ.. ‘బాహుబలి’ చిత్రంలోని సీన్‌తో రవిని భల్లాలదేవుడిగా మార్చేశాడు.

షణ్ముఖ్‌ను టార్గెట్ చేసుకున్న సభ్యులు: రవి థాంక్స్ చెబుతుంటే షణ్ముఖ్ పెద్దగా స్పందించలేదు. దీంతో రవి ‘‘ఎందుకురా అంత కోపం’’ అని షణ్ముఖ్‌ను రవి ప్రశ్నించాడు. ఎవరైనా ఎక్కిస్తే తనతో మాట్లాడాలని రవి అన్నాడు. నామినేట్ చేసినందుకు కోపమా అని అడిగాడు. అదేమీ కాదని షన్ను.. వాష్ రూమ్‌కు వెళ్లిపోయాడు. షన్నూ మూడీగా కూర్చోవడంపై రవి, యానీ, లోబో, విశ్వ, సన్నీ చర్చించుకున్నారు. జస్సీకి నువ్వు ఎన్నో చెప్పావు కానీ, అతడు నీకు మైండ్ యువర్ బిజినెస్ అన్నడని.. యానీ మాస్టర్ రవికి బ్రైన్ వాష్ చేసింది.  

కంగుతిన్న షణ్ముఖ్ టీమ్: మిమ్మల్ని రాజు చేసిన ప్రజల నుంచి ముగ్గురిని ఎంపిక చేసుకుని కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా ఎంపిక చేయాలని బిగ్‌బాస్ రవికి ఆదేశించాడు. దీంతో షన్ను అండ్ గ్యాంగ్‌కు గొంతులో వెలక్కాయపడినట్లు అయ్యింది. దొంగ మార్గాల్లో నాణాలు సంపాదించినా.. పనికిరాకుండా పోయిందని వాపోయారు. ఈ సందర్భంగా సిరి స్పందిస్తూ.. అంతా వేస్ట్ అయ్యిందంటూ బాధపడింది. రవి మాట్లాడుతూ.. ‘‘నీతి నిజాయితీ గెలిచింది’’ అని తన టీమ్ సభ్యులకు తెలిపాడు. పరాజయాన్ని తట్టుకోలేక షన్ను, కాజల్, సన్నీ, సిరి, జస్సీలు తీవ్ర ఆందోళన చెందారు. హమీదా కెప్టెన్ కాకూడదని కోరుకుంటున్నా.. వారిని భరించడం చాలా కష్టం అని షన్ను వ్యాఖ్యానించారు. హమీద, యానీ, స్వేతను రవి కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశాడు. 

ప్రియాకు గుడ్ న్యూస్..: ప్రియా కెప్టెన్ అయ్యే అర్హతను కోల్పోయిందని, ఆమెకు ఒక అవకాశం ఇస్తున్నామని బిగ్ బాస్ తెలిపాడు. కెప్టెన్సీ పోటీదారులైన నలుగురిలో ఒకరు తప్పుకుని ప్రియకు కెప్టెన్సీ పోటీదారునిగా అర్హత ఇవ్వాలని బిగ్ బాస్ తెలిపాడు. ఈ సందర్భంగా రవి.. పోటీ నుంచి తప్పుకోడానికి సిద్ధమయ్యాడు. దీంతో హమీదా స్పందిస్తూ.. ప్రియా తన వల్లే కెప్టెన్సీ కోల్పోయారని, అందుకు తానే తప్పుకుని ఆ అవకాశం ప్రియాకు ఇస్తానని హమీదా తెలిపింది. తన కాయిన్స్‌ను ప్రియాకు అందించి కెప్టెన్సీ పోటీలో అవకాశం కల్పించింది. 

Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు

ఇంటి కెప్టెన్‌గా ప్రియా?: తదుపరి కెప్టెన్‌ను ఎంచుకొనేందుకు.. ‘పదివేలు సరిపోవు సోదరా’ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా నలుగురు సభ్యులకు నాలుగు రంథ్రాలు ఉండే నీటి ట్యాంక్ ఇచ్చాడు. వారికి సపోర్ట్ చేసే సభ్యులు ఆ ట్యాంక్ రంథ్రాలు మూసి నీళ్లు బయటకు పోకుండా సపోర్ట్ చేయాలని బిగ్ బాస్ తెలిపాడు. ఈ టాస్క్‌కు షణ్ముఖ్‌ను సంచాలకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నాడు. ఈ టాస్క్‌లో యానీ, శ్వేత, ప్రియా, రవి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ టాస్క్‌లో ప్రియా విజేతగా నిలిచినట్లు సమాచారం. 

Also Read: ‘మా’కు ప్రత్యేక యాప్.. నా డబ్బుతో భవనం కడతా.. మంచు విష్ణు ప్యానల్ ముఖ్య హామీలు ఇవే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Oct 2021 11:33 PM (IST) Tags: Bigg Boss Telugu Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు బిగ్ బాస్ తెలుగు Bigg Boss 5 Telugu Episode 33 బిగ్ బాస్ 5 తెలుగు ఎపిసోడ్ 33

సంబంధిత కథనాలు

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

Prudhvi Raj: ఆర్జీవీ సినిమాలు ఎవరూ చూడరు, ఎవరూ పట్టించుకోరు - ‘వ్యూహం’పై ఫృథ్విరాజ్ సెటైర్లు

Prudhvi Raj: ఆర్జీవీ సినిమాలు ఎవరూ చూడరు, ఎవరూ పట్టించుకోరు - ‘వ్యూహం’పై ఫృథ్విరాజ్ సెటైర్లు

టాప్ స్టోరీస్

Academic Calendar: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు