By: ABP Desam | Updated at : 07 Oct 2021 10:12 PM (IST)
Image Credit: Star Maa/Hotstar
కెప్టెన్సీ కోసం ‘బిగ్ బాస్’ పెట్టిన టాస్క్ ‘రాజ్యానికి ఒక్కడే రాజు’లో ఈ రోజు విజేతలు ఎవరో తేలిపోనుంది. ఈ రోజు విడులైన రెండో ప్రోమో ప్రకారం.. సభ్యులు తమ తమ స్ట్రాటజీలతో రాజు పాత్రదారులైన రవి, సన్నీలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. తమ రాజ్యంలో ఉన్న ప్రజలే వెన్నుపోటు పొడుస్తారేమో అనే సందేహంతో రాజులు ఉన్నారు. అయితే, ఈ రోజు ఎపిసోడ్‌లో ఇంట్లోని సభ్యులంతా హమీదాను టార్గెట్ చేసుకున్నారు అనిపిస్తోంది. హమీదాను ఈసారి కెప్టెన్ చేసేందుకు శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడని యానీ మాస్టార్, షన్ముఖ్ భావిస్తున్నారు. ఒక వేళ హమీదా కెప్టెన్‌గా ఎంపికైతే.. శ్రీరామ్ రేషన్ మేనేజర్ అవుతాడని షన్ముఖ్ అన్నాడు. చివర్లో నేను కెప్టెన్ అవుతానంటూ శ్రీరామ చంద్ర అనడం మరో ట్విస్ట్. ఈ నేపథ్యంలో ఈ రోజు హౌస్‌కు కెప్టెన్ అయ్యేదెవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
‘బిగ్ బాస్ 5’ ప్రోమో 2:
Ye Raju gelisthadu? Captaincy contender evaru? Evari game strategy ela undi?#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/yS81XNWMY3
— starmaa (@StarMaa) October 7, 2021
ఉదయం విడుదలైన మొదటి ప్రోమోలో.. ప్రియాంకకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ‘‘నాన్న సాయితేజా.. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సర్వం నువ్వే మాకు’’ అని ప్రియాంక తండ్రి అంగీకరిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. తండ్రి మాటలు విని ప్రియాంక సింగ్ భావోద్వేగానికి లోనైంది. తన ఇంటికి తాను దొంగలా వెళతానని.. బయటకు కూడా రానని.. కనీసం పక్కింటి వాళ్లకి కూడా తెలియదని కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నన్ను అంగీకరించడంతో ఎప్పటిలానే ఇంటికి రావొచ్చానంది. డాడీ ఐ లవ్ యూ అంటూ ఏడ్చేసింది. ఇంటి సభ్యులంతా కూడా ఎమోషనల్ అయ్యారు. పూలు, బొట్టు తీసుకొచ్చి ప్రియాంక సింగ్‌ను అందంగా అలంకరించారు. కానీ, చివర్లో ఆమె మానస్ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తానికి ప్రోమో చూస్తుంటే ఈ రోజు హౌస్ మొత్తం భావోద్వేగంతో నిండిపోయినట్లే ఉంది.
Also Read: నీకు నేనున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ అభయం, వీడియో వైరల్
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు
Samudram Chittabbai: ఈ రాజ్యంలో రాణే రాజుని వదిలేస్తుంది - ఆసక్తికరంగా ‘సముద్రం చిట్టబ్బాయి’ ట్రైలర్
Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
Tollywood Deaths, Shocks - 27th Jan : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!