Mega154: చిరుతో బాబీ సినిమా - ఇంతలా ఖర్చు పెడితే వర్కవుట్ అవుతుందా?
'మెగా154' సినిమా బడ్జెట్ విషయాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం రూ.125 నుంచి రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. నిన్ననే ఈ సినిమా షూటింగ్ లో రవితేజ పాల్గొన్నట్లు ప్రకటించింది టీమ్. చిరుకి తమ్ముడిగా కనిపించనున్నారు రవితేజ.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయాలు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం రూ.125 నుంచి రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రెమ్యునరేషన్లకే రూ.75 కోట్లు ఖర్చు అవుతుందట. చిరంజీవికి అటు ఇటుగా రూ.40 కోట్లకు పైగానే ఇస్తున్నారు. రవితేజకి రూ.18 కోట్లని టాక్. దర్శకుడు బాబీకి ఎలా లేదన్నా ఐదారు కోట్లు ఇస్తారు. మిగిలిన నటీనటులకు టెక్నీషియన్స్ కు కలుపుకొని రూ.75 కోట్లు దాటేస్తుందట.
'ఆచార్య' లాంటి డిజాస్టర్ తరువాత కూడా చిరు సినిమాకి ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. కానీ ఇలా బడ్జెట్ పెంచుకుంటూ పోవడం వలనే 'ఆచార్య'కి నలభై కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. అది తెలిసి కూడా మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
మరోపక్క ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ ను విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ దాదాపు ఫైనల్ చేసినట్లే. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరు లిస్ట్ లో 'భోళాశంకర్', వెంకీ కుడుముల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.
Also Read: నాగచైతన్య 'థాంక్యూ' సినిమా రన్ టైం ఎంతంటే?
Also Read: కోవిడ్ బారిన పడ్డ హీరోయిన్ - వీడియో వైరల్
View this post on Instagram